దర్శకుడు అంటే సినిమా తీసిపెట్టడం ఒకటే కాదు. నిర్మాత శ్రేయస్సు కూడా చూడాలి. తీసే సినిమా, దాని సబ్జెక్ట్, దాని హీరో, అతగాడి మార్కెట్ అంతా చూడాలి.
కొరటాల శివ లాంటి పెద్ద దర్శకులు అయితే మార్కెటింగ్ కూడా చూస్తున్నారు. అప్పుడే నిర్మాత బాగుంటాడు. అలా కాకుండా, తన పని డైరక్షన్, తనకు కావాల్సిన టెక్నీషియన్లు, తనకు కావాల్సిన బడ్జెట్ అని చూసుకంటే నిర్మాత కుదేలయిపోతాడు.
ఇంద్రగంటి సినిమాలతో సమస్య ఏమిటంటే, ఆయన పేరుకు చిన్న సినిమాలు తీస్తాడు. కానీ సాంకేతికంగా ఎక్కువ ఖర్చుచేయిస్తాడు. దాంతో సినిమా మార్కెట్ దగ్గర తేడా వస్తుంది.
లేటెస్ట్ గా సుధీర్ బాబుతో సినిమా చేస్తున్నారు. టీజర్ వచ్చింది. మాంచి రిచ్ లుక్ తో వుంది. దాన్నిబట్టి ఖర్చు అంచనా వేసుకోవచ్చు. కానీ సుధీర్ బాబు మార్కెట్ ఎంత? ఇప్పటి వరకు అతగాడి సినిమాల వసూళ్లు ఎంత? మహా అయితే అయిదారుకోట్లు అంటే అదే పెద్ద రిస్క్ అనుకోవాలి.
అలాంటిది, సమ్మోహనం సినిమా కోసం ఏకంగా ఎనిమిదిన్నర కోట్ల వరకు ఖర్చు చేయించినట్లు తెలుస్తోంది. ఇక దానిపై వడ్డీలు, పబ్లిసిటీ అన్నీ కలుపుకుంటే పది కోట్లకు పైగానే వుంటుంది.
మరి ఎంత ఇంద్రగంటి డైరక్టర్ అయితే మాత్రం పది పదకొండు కోట్లు సుధీర్ బాబు మీద ప్రీ రిలీజ్ రికవరీ అంటే, పరిస్థితి ఊహించుకోవచ్చు.