ఒక్కరి కోసం ఇండస్ట్రీ తలొగ్గిందా?

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది. మీడియా మీద బ్యాన్, బ్యాన్ అంటూ రంకెలు వేసింది ఎవరు? ఇప్పుడు కొత్తగా ఓ అధికారిక కమిటీ అంటూ నియామకం ఎలా జరిగింది? ఈ పదమూడు మందిని ఎవరు…

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది. మీడియా మీద బ్యాన్, బ్యాన్ అంటూ రంకెలు వేసింది ఎవరు? ఇప్పుడు కొత్తగా ఓ అధికారిక కమిటీ అంటూ నియామకం ఎలా జరిగింది? ఈ పదమూడు మందిని ఎవరు నియమించారు? వీరిలో మెజారిటీ జనాలు నిర్మాత సురేష్ బాబు స్వంత మనుషులు అన్న విమర్శలు నిజమా? కాదా? వీరిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేసారు?

వీరిలో దిల్ రాజు, సునీల్ నారంగ్, యాక్టర్ నరేష్ ను తప్పిస్తే, సినిమా నిర్మాతలు, లేదా ఇతర వ్యవహారాల్లో యాక్టివ్ గా వున్నవారు ఎంతమంది? అన్న ప్రశ్నలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నిజంగా యాక్టివ్ గా వున్నవారిని పక్కన పెట్టి, సురేష్ బాబుకు అనుకూలమైన వారితో అధికారిక కమిటీ అంటూ ఒకదాన్ని ఏకపక్షంగా తయారుచేసారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మా అసోసియేషన్ లో కీలకమైన శివాజీరాజా కానీ, హేమ కానీ కమిటీలో కనిపించలేదు.

మీడియాతో తగాయిదా పడమని తాము చెప్పడం లేదని, అసలు మీడియా మీద కాలుదువ్వమని ఎవరు చెప్పారు? ఇప్పుడు బే షరుతుగా వెనక్కు తగ్గమని ఎవరు చెప్పారు? ఇంత జరిగాక ఇకపై భవిష్యత్ లో మీడియా గురించి ఇండస్ట్రీలో ఏ ఒక్కరైనా చిన్న మాట అనడానికైనా సాహసించగలరా? ఇక ఎప్పటికీ టాలీవుడ్ మీడియాకు ఒదిగి వుండాల్సిందే గా? అన్నక్వశ్చన్లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే టోటల్ ఎపిసోడ్ మొత్తం మెగా ఫ్యామిలీకి, లేదా ఇండస్ట్రీలోని ఒక వర్గానికే పరిమితం చేసే విధంగా మొత్తం వ్యవహారాన్నిమార్చేసారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎడిటర్ల సమావేశంలో చర్చించిన మేరకు ఓ క్వశ్చనీర్ ను తయారుచేసినట్లు తెలుస్తోంది. ఆ క్వశ్చనీర్ ను జర్నలిస్ట్ ల ప్రతినిధులు, ఇండస్ట్రీ ప్రతినిధుల ముందు వుంచినట్లు తెలుస్తోంది. ఆ క్వశ్చనీర్ ను చూస్తూనే ఇండస్ట్రీ ప్రతినిధులు మారు మాట్లాడలేకపోయారని బోగట్టా. ఆ క్వశ్చనీర్ ను గ్రేట్ ఆంధ్ర సంపాదించింది. అది ఇలా వుంది.