అర్జున్ రెడ్డి సినిమా ఓ బోల్డ్ సినిమా. పెద్దవాళ్లు కూడా చూడ్డానికి కాస్త జంకిన సినిమా. తరువాత అదే డిఫరెంట్ మూవీ అని అందరూ పొగిడారు.
మరి అలాంటి అర్జున్ రెడ్డి, పెద్దలకు మాత్రమే సినిమా కాకుండా, అందరి కోసం సినిమా చేస్తే.. అలా చేసిన విషయం అందరికి తెలియాలి కదా? అందుకే ఓ డిఫరెంట్ వీడియో చేసి వదిలారు టాక్సీ వాలా నిర్మాతలు.
అయిదు నిమషాలకు పైగా నిడివి వున్న లెంగ్తీ ప్రోమో వీడియో చూడ్డానికి బాగుంది. పిల్లలు తాము థియేటర్లో అర్జున్ రెడ్డిని చూడాలనుకుని డిమాండ్ చేయడం, ఆ తరువాత వాళ్లుచేసిన మారాం, అల్లరి, హడావుడి అంతా ఓ చిన్న షార్ట్ స్టోరీలా తయారు చేసారు.
విజయ్ దేవరకొండ తన సహజమైన స్టయిల్ లో దీన్ని కూడా రక్తి కట్టించాడు. ఇది పెద్దల సినిమా కాదు, పిల్లల సినిమా అనే టైపులో ప్రమోట్ చేసే విధంగా ఓ వీడియో వదిలే అయిడియా బాగుంది.