తమిళ, మళయాల, చైనాల్లోకి రంగస్థలం

ఈ ఏటి తొలి బ్లాక్ బస్టర్ గా రంగస్థలం సినిమాను చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన సినిమా ఇది. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీలు చూడాలి అని…

ఈ ఏటి తొలి బ్లాక్ బస్టర్ గా రంగస్థలం సినిమాను చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన సినిమా ఇది. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీలు చూడాలి అని ఉత్సాహపడేలా చేసిన సినిమా ఇది.

ఈ సినిమా కొనక్కున్న ప్రతి బయ్యర్ భయంకరంగా లాభపడ్డారు. అటు ఓవర్ సీస్ నుంచి ఇటు డొమస్టిక్ బయ్యర్ వరకు ప్రతి ఒక్కరు మాంచి లాభాలు చేసుకున్నారు. సినిమా విడుదలై ముఫై రోజులుకు దగ్గరవుతుంది.

ప్రస్తుతం 195కోట్లు గ్రాస్ వచ్చిందట ఈసినిమాకు.. పూర్తిగా రెండు వందల కోట్లు అయిన తరువాత ఆ పోస్టర్ వేయాలని యూనిట్ భావిస్తోంది. కేవలం 200కోట్లు గ్రాస్ అని కాకుండా, వివరంగా పోస్టర్ వేయాలని చూస్తున్నారని వినికిడి.

ఇదిలావుంటే తమిళ, మలయాళ, చైనా భాషల్లోకి ఈ సినిమాను డబ్ చేసే పని చురుగ్గా జరుగుతోందట. త్వరలో ఆయా భాషల్లో విడుదల చేసేందుకు మైత్రీ మూవీస్ సన్నాహాలు చేస్తోందట.

ఈ సినిమా విడుదల ద్వారా మైత్రీ మూవీస్ విడుదలకు ముందే పాతిక కోట్లకు పైగా లాభం చేసుకుంది. పైగా కొన్ని ఏరియాలు తామే వుంచుకోవడం ద్వారా మరింత లాభం చేసుకున్నారు. ఇప్పుడు ఈ పరభాషా డబ్బింగ్ ద్వారా మరి కాస్త లాభం అన్నమాట.