అమ్మడు అక్కడ ఆరబోసేసిందిగా

రాశీఖన్నా, రకుల్ లతో పాటే వచ్చినా రెజీనా తెలుగులో అంతగా టాప్ హీరోయిన్ కాలేకపోయింది. ఆఖరికి కాస్త కిందకు దిగి తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో కాస్త గ్లామరస్ గా కనిపించే ప్రయత్నం చేసింది.…

రాశీఖన్నా, రకుల్ లతో పాటే వచ్చినా రెజీనా తెలుగులో అంతగా టాప్ హీరోయిన్ కాలేకపోయింది. ఆఖరికి కాస్త కిందకు దిగి తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో కాస్త గ్లామరస్ గా కనిపించే ప్రయత్నం చేసింది. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది.

ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇలాంటి టైమ్ లో తమిళనాట ఓ సినిమా చేసింది రేజీనా. మిస్టర్ చంద్రమౌళి అనే ఈ సినిమా ట్రయిలర్ ఇటీవలే బయటకు వచ్చింది.

ఈ సినిమా స్పెషల్ ఏమిటంటే, తెలుగువారికి కూడా పరిచయం వున్న తమిళ సీనియర్ హీరో కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ ఇందులో తన తండ్రితో కలిసి నటించడం. అంటే సీనియర్ కార్తీక్, జూనియర్ కార్తీక్ ఇద్దరూ వున్నారన్నమాట ఇందులో. ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాకు గతంలో విశాల్ తో సినిమాలు చేసిన తిరు డైరక్టర్.

ఇంతకీ విషయం ఏమిటంటే ఈ సినిమాలోని ఓ పాటలో రెజీనా రెచ్చిపోయి నటించింది. టోటల్ గా ఇంతకన్నా గ్లామరస్ గా నటించడం తన వల్ల కాదు అన్నంతగా నటించింది.

ట్రయిలర్ లో ఈ పాట బిట్ చూసిన వాళ్లు, ఆఫ్ లైన్ లో పాట మొత్తం చూసిన తమిళ ఇండస్ట్రీ జనాలు, అమ్మో.. రెజీనాలో ఇంత వుందా అని ఆశ్చర్యపోతున్నారు. పోనీ ఈ పాట పూర్తిగా చూసిన తరువాత అయినా మన జనాలు రెజీనాను అలాంటి ఆరబోతల కోసం తెలుగులోకి కూడా తీసుకుంటారేమో చూడాలి.