రామ్ గోపాల్ వర్మ.. ఓ ఇంటిలిజెంట్ క్రూక్

ఎప్పుడూ శాంతంగా, నవ్వుతూ కనిపించే అల్లుఅరవింద్ ఒక్కసారిగా భగ్గుమన్నాడు. రామ్ గోపాల్ వర్మ మీద మాటల తూటాలు పేల్చాడు. రామ్ గోపాల్ వర్మ గారూ అని అనలేను.. మిస్టర్ రామ్ గోపాల్ వర్మ అనే…

ఎప్పుడూ శాంతంగా, నవ్వుతూ కనిపించే అల్లుఅరవింద్ ఒక్కసారిగా భగ్గుమన్నాడు. రామ్ గోపాల్ వర్మ మీద మాటల తూటాలు పేల్చాడు. రామ్ గోపాల్ వర్మ గారూ అని అనలేను.. మిస్టర్ రామ్ గోపాల్ వర్మ అనే అనాలి. అంటూ మొదలుపెట్టి, అరవింద్ చకచకా పాయింట్ టు పాయింట్ మాట్లాడి ఆర్జీవీని మాటలతో కుమ్మేసాడు.

పవన్ కళ్యాణ్ సైజ్ తగ్గించడానికి కుట్రపనిన్న రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటిలిజెంట్ క్రూక్, ఓ క్రిమినల్, ఇలాంటి వాడికి ఏ శిక్ష విధించాలో ఇండస్ట్రీకి, సమాజానికి వదిలేసానని అరవింద్ అన్నారు.

సురేష్ బాబు, రామానాయుడు ఫ్యామిలీ కోసం డీల్ చేసా అన్న ఆర్జీవీకి తమది కూడా ఓ ఫ్యామిలీ గుర్తు రాలేదా అని సూటిగా ప్రశ్నించారు. రామ్ గోపాల్ వర్మ అనే నీచుడి ప్రవృత్తి తన తల్లి లాంటి ఇండస్ట్రీ నే బాధపెట్టే పని చేయడానికి వెనుక శక్తులు ఏమిటి? ఎవరు ప్రేరేపించారు లాంటి విషయాలు అన్నీ బయటకు రావాల్సి వుందని అరవింద్ అనడం విశేషం. కేవలం ఆర్జీవీ మాత్రమే కాక, ఆయన సన్నిహితులు కూడా కొందరు ఈ కుట్రలో వున్నారని అరవింద్ అభిప్రాయపడ్డారు.

కుటుంబంతో సంబంధం లేకుండా, స్వంతగా పవన్ కళ్యాణ్ ఓ మంచి ఆశయంతో ముందుకు వెళ్తున్నారని తామంతా దూరంగా వున్నామని, కానీ అలాంటి వ్యక్తి సైజు తగ్గించడానికి కుట్రలు పన్నుతుంటే, కోపం పట్టలేక బయటకు వచ్చామని అరవింద్ అన్నారు.

ఆర్జీవీ గురించి ఏం చేయాలో పవన్, ఆయన అభిమానులే నిర్ణయించాలన్నారు. ఆర్జీవీ సినిమాలను కానీ, ఆయనను కానీ బ్యాన్ చేయడం అన్నది తన ఒక్కడి పని కాదని, అది ఇండస్ట్రీ అంతా కలిసి చేయాల్సిన పని అని అరవింద్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మొత్తం మీద చిరకాలంగా చెలరేగుతున్న ఆర్జీవీకి ది ఎండ్ కార్డ్ పడేటట్లే కనిపిస్తోంది.