నేలటికెట్ వాయిదా?

కళ్యాణ్ కృష్ణ-రవితేజ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా నేలటికెట్. ఈ సినిమా మే 25విడుదల టార్గెట్ గా రెడీ అవుతోంది. అయితే జూన్ 1కి వెళ్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఆ…

కళ్యాణ్ కృష్ణ-రవితేజ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా నేలటికెట్. ఈ సినిమా మే 25విడుదల టార్గెట్ గా రెడీ అవుతోంది. అయితే జూన్ 1కి వెళ్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఆ సినిమా షూట్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నెలాఖరులోగా టాకీ మొత్తం పూర్తయిపోతుంది.

అక్కడికి రెండు పాటలు మాత్రమే బకాయి వుంటాయి. అయితే నేలటికెట్ సినిమాలో హీరోయిన్ మాళవికకు కాలునరం మెలితపడిందని తెలుస్తోంది. దీనివల్ల ఆమె కాలు మీద మరీ ఎక్కువ భారం మోపడం ప్రస్తుతానికి ఇబ్బందిగా వుందని, లైట్ గా స్టాండింగ్ పోజిషన్ లో వుండే షాట్లు అయితే ఓకె కానీ, డ్యాన్స్ లు అంటే కాస్త టైమ్ పడుతుందని వినికిడి.

అయితే చిన్న సమస్యే కాబట్టి, మే ఫస్ట్ వేళకు ఆమెకు కాలు సెట్ అయిపోతుందని అప్పుడు సాంగ్స్ కు వెళ్లే అవకాశం వుందని తెలుస్తోంది. అలా అయితే విడుదలకు టైమ్ సరిపోతుంది.

లేదూ, అనుకుంటే జూన్ ఫస్ట్ కు వాయిదా పడినా ఆశ్చర్యంలేదు. నేలటికెట్ తో పాటు అదే రోజున నాగార్జున-ఆర్జీవీ కాంబినేషన్ లో తయారవుతున్న ఆఫీసర్ విడుదల వుంది. అలాగే కళ్యాణ్ రామ్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ 'నా నువ్వే' కూడా అదే రోజు విడుదలవుతుంది.