జగపతి కొడుకుగా నవీన్ చంద్ర

హీరో నవీన్ చంద్ర ఇక ఆ రూట వదిలేసినట్లే కనిపిస్తోంది. మెలమెల్లగా క్యారెక్టర్ యాక్టర్ గా మారిపోతున్నాడు. బోయపాటి-రామ్ చరణ్ సినిమాలో అన్న క్యారెక్టర్ వేస్తున్నట్లు ఇప్పటికే వార్త బయటకు వచ్చింది. Advertisement లేటెస్ట్…

హీరో నవీన్ చంద్ర ఇక ఆ రూట వదిలేసినట్లే కనిపిస్తోంది. మెలమెల్లగా క్యారెక్టర్ యాక్టర్ గా మారిపోతున్నాడు. బోయపాటి-రామ్ చరణ్ సినిమాలో అన్న క్యారెక్టర్ వేస్తున్నట్లు ఇప్పటికే వార్త బయటకు వచ్చింది.

లేటెస్ట్ గా జగపతిబాబు కొడుకుగా కూడా నటించబోతున్నాడు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో జగపతి బాబుది చాలా కీలకపాత్ర. ఈ పాత్రకు కొడుకు పాత్రలో నవీన్ చంద్ర కనిపిస్తాడట.

అయితే బోయపాటి శీను మాదిరిగా కాదు త్రివిక్రమ్ వ్యవహారం. హీరోలతో సమానంగా వేరే వాళ్లను ఎలివేట్ చేయడం అన్నది అనుమానం. అజ్ఞాతవాసిలో ఆది పినిశెట్టి విలనిజంను, సరైనోడులో ఆది పినిశెట్టి క్యారెక్టర్ ను చూస్తే అది అర్థం అవుతుంది.

అయితే అజ్ఞాతవాసి విషయంలో పవన్ తో సాన్నిహిత్యం అడ్డంపడి వుండొచ్చు. ఇక్కడ ఎన్టీఆర్ కాబట్టి కాస్త బాగానే క్రియేట్ చేసే అవకాశం వుంది. కానీ మరీ అంత క్రూషియల్ రోల్ అయితే కాదని వినికిడి.

హారిక హాసిని సంస్థ నిర్మించే ఈ సినిమాను దసరా విడుదల లక్ష్యంగా రెడీ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.