పవన్, రేణు దేశాయ్ విడిపోయారు. కానీ పవన్ పై తనకున్న అభిమానాన్ని ట్వీట్స్ రూపంలో ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంటుంది రేణుదేశాయ్. పవన్ పాత ఫొటోలతో పాటు మరికొన్ని సంఘటనల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గుర్తుచేస్తుంటుంది. ఈ వ్యవహారంపై ఒకదశలో పవన్ ఫ్యాన్స్, రేణు మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది.
పవన్ పై స్పందించే సర్వహక్కులు తనకు ఉన్నాయని, పవన్ పై ట్వీట్ చేయకుండా తనను ఎవరూ ఆపలేరని ఆ టైమ్ లో కాస్త ఆవేశంగానే స్పందించింది రేణుదేశాయ్. పవన్ ను ఇంతలా ఓన్ చేసుకున్న ఈ మాజీ భార్య ఇప్పుడు మాత్రం పవన్ పై ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా పెట్టడం లేదు. ఓవైపు పవన్ పై శ్రీరెడ్డి దారుణంగా విమర్శలు చేస్తుంటే.. అభిమానులతో పాటు పరిశ్రమ మొత్తం పవన్ కు మద్దతు పలుకుతుంటే, రేణు మాత్రం సైలెంట్ అయిపోయింది.
నిజానికి పవన్ ఎలాంటి వాడనే విషయం అభిమానుల కంటే అతడితో జీవితాన్ని పంచుకున్న రేణుదేశాయ్ కు బాగా తెలుస్తుంది. పవన్ ను అత్యంత సమీపంగా గమనించిన ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో రేణుదేశాయ్ కూడా ఒకరు. అలాంటి వ్యక్తి పవన్ వ్యక్తిత్వంపై ఇలాంటి టైమ్ లో స్పందించి ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు.
పవన్ అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటాడని కొందరు ఆరోపిస్తున్నారు. పవన్ కు అమ్మాయిలంటే చులకనభావం అని మరికొందరు విమర్శిస్తున్నారు. శ్రీరెడ్డి లాంటి వాళ్లు పవన్ ను అత్యంత దారుణంగా నిందిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో పవన్ వ్యక్తిత్వంపై రేణుదేశాయ్ స్పందించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నిజానికి ఇక్కడ రెండు రీజన్ లు ఉన్నాయి. ఒకవేళ తను పవన్ కు మద్దతుగా ట్వీట్ చేసినప్పటికీ, అది రివర్స్ లో ఫైర్ అయితే మరింత నష్టం జరిగే ప్రమాదముందని రేణుదేశాయ్ సైలెంట్ అయి ఉండొచ్చు. లేకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని మరింత రచ్చ చేయడం ఇష్టంలేక ట్వీట్స్ కు దూరంగా ఉండొచ్చు. కారణం ఏదైతేనేం.. రేణుదేశాయ్ మాత్రం దాదాపు 10రోజులుగా అసలు ఎలాంటి ట్వీట్ చేయడంలేదు.