ఏ చానెల్ లో అయితే గెలిచిందో..?

కాళ్ల కింద నేల బలంగా వుందో లేదో చూసుకోకుండా, చానెళ్లు వాటి టీఆర్పీ కోసం తనకు ఇస్తున్న ప్రయారిటీ వెనుక వున్న వాస్తవం తెలుసుకోకుండా, తన కింద చాలా తప్పులు పెట్టుకుని, సాక్షి నుంచి…

కాళ్ల కింద నేల బలంగా వుందో లేదో చూసుకోకుండా, చానెళ్లు వాటి టీఆర్పీ కోసం తనకు ఇస్తున్న ప్రయారిటీ వెనుక వున్న వాస్తవం తెలుసుకోకుండా, తన కింద చాలా తప్పులు పెట్టుకుని, సాక్షి నుంచి ఇప్పటి వరకు వున్న ప్రస్థానంలో తన తప్పులు అనేకం పెట్టుకుని కూడా శ్రీరెడ్డి ఏదో చేద్దాం అనుకుని, మరేదో చేయబోయి, ఇంకేదో చేసే పయత్నం చేసి, ఆఖరికి అదే చానెల్ లో అరడజను మంది మధ్య కార్నర్ అయిపోయి, బాబు గోగినేని చేత సూపర్ గా క్లాస్ పీకించేసుకుని, వలవలా ఏడిచి, తాను ఓడిపోయాను అని చెప్పాల్సిన దుస్థితి వచ్చింది.

ఏ చానెల్ లో అయితే శ్రీరెడ్డి రివ్వున పైకి ఎగిసిందో, అదే చానెల్ లో పూర్తిగా చతికిల పడిపోయింది. బాబు గోగినేని, సుతిమెత్తగా మాట్లాడుతూనే శ్రీరెడ్డిని పూర్తిగా మరి లేవకుండా మాటల తూటాలతో పేల్చేసారు.

శ్రీరెడ్డి బిహేవియర్ ను, వ్యభిచారాన్ని బ్యాన్ చేస్తే ఎలా బతకాలన్న మాటలను, సెల్ఫీలు పట్టుకుని చీటింగ్ చేసారని అనడాన్ని, ఇలా ప్రతి ఒక్కదాన్ని కౌంటర్ చేస్తూ, నిలదీసేసరికి శ్రీరెడ్డికి మాటలేదు. కంట కన్నీళ్లు తప్ప. దాన్ని కూడా బాబు గోగినేని తప్పు పట్టారు. అసలు కెమేరా అటు చూపించవద్దని, ఈ కన్నీళ్లను నమ్మలేమన్నట్లుగా ఆయన కామెంట్ చేసారు.

మొత్తం మీద చానెళ్లు తమ టీఆర్పీ గోల్ తాము సాధించేసాక, ఇక శ్రీరెడ్డి ఉదంతం వెగటు పుడుతోందని, ఇది వికటిస్తోందని గమనించాక, చాలా తెలివిగా, కాగల కార్యం గంధర్వులు తీర్చేసినట్లుగా, అదే చానెల్ లో, అదే డిస్కషన్లొ, వక్తల ద్వారానే ఫుల్ స్టాప్ పెట్టించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. పాపం, శ్రీరెడ్డి, తనే తెలివైనది అనుకుంది. తన కన్నా బలమైన వ్యవస్థలు వున్నాయని తెలుసుకోలేకపోయింది.