‘భరత్’ పొలిటికల్ షో

సాధారణంగా పెద్ద సినిమాలు, కాస్త మంచి సినిమాలు విడుదలయితే రాజకీయ ప్రముఖులు కూడా చూడడానికి కాస్త ఆసక్తి ప్రదర్ళించడం కామన్. అలాంటిది ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా వస్తే ఇంకా ఎక్కువ ఆసక్తి…

సాధారణంగా పెద్ద సినిమాలు, కాస్త మంచి సినిమాలు విడుదలయితే రాజకీయ ప్రముఖులు కూడా చూడడానికి కాస్త ఆసక్తి ప్రదర్ళించడం కామన్. అలాంటిది ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా వస్తే ఇంకా ఎక్కువ ఆసక్తి వుంటుంది. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను కూడా పోలిటీషియన్స్ కోసం ఓ షో వేసే ఆలోచనలో వున్నట్లు నిర్మాత దానయ్య తెలిపారు.

మీడియాను పిలిచి, పొలిటీషియన్లకు ఓ షో వేసే ఆలోచన అయితే వుందని ఆయన అన్నారు. సిఎమ్ కెసిఆర్ కు చూపిస్తారా? అని అడిగితే, ఆయన అడిగితే తప్పకుండా అని సమాధానం ఇచ్చారు. తాను నిర్మించిన నిన్ను కోరి సినిమా కేసిఆర్ కుటుంబ సభ్యులకు బాగా నచ్చిందని, మూడు సార్లు అడిగిమరీ చూసారని అన్నారు. ఇప్పుడు కూడా కేసిఆర్ కుటుంబం నుంచి కబురు వస్తే, భరత్ అనే నేను సినిమా చూపించడానికి సిద్దంగా వున్నామన్నారు.

కేసిఆర్ కానీ, కెటిఆర్ కానీ వారి కుటుంబ సభ్యులంతా సినిమా ప్రియులే. మంచి సినిమా వస్తే వదలకుండా చూస్తారు. అందువల్ల భరత్ అనే నేను సినిమా మీద వాళ్ల అభిప్రాయాలు కచ్చితంగా వస్తాయని, అవి సినిమాకు మరింత ప్లస్ అవుతాయని భరత్ యూనిట్ నమ్మకంగా వుంది.