ఎమ్మెల్యే సినిమా విడుదలయింది. నా నువ్వే విడుదలకు రెడీగా వుంది. కళ్యాణ్ రామ్ మరో సినిమాకు శ్రీకారం చుట్టేస్తున్నారు. నా నువ్వే సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ సోలోగా నిర్మించే సినిమాకు ఓకె చెప్పారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారు.
ఇప్పటి వరకు సినిమాటోగ్రాఫర్ గా వున్న గుహాన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాటోగ్రాఫర్ గా గుహాన్ కు మాంచి పేరు వుంది. ఆయన తెచ్చిన మాంచి సబ్జెక్ట్ విని కళ్యాణ్ రామ్ ఓకే చేసారని తెలుస్తోంది. ఈ సబ్జెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వుంటుందని వినికిడి.
అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. అందుకోసం నివేధా థామస్ ను, షాలినీ పాండేను ఎంపిక చేసి అగ్రిమెంట్ చేసారు. నివేధా నిన్ను కోరి సినిమాతో జనాలకు దగ్గరయింది. షాలినీ పాండే అటు అర్జున్ రెడ్డి చేసింది. ఇప్పుడు నిఖిల్ తో ముద్ర సినిమా చేస్తోంది. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు కళ్యాణ్ రామ్-గుహాన్ కాంబినేషన్ లో చేస్తారన్నమాట.