నా పేరు సూర్య. బన్నీ-వక్కంతం వంశీ కాంబినేషన్ లో రాబోతున్న ప్రెస్టీజియస్ సినిమా. ఈసినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెలాఖరున అంటే 29న జరగబోతోంది. అయితే వెన్యూ ఇంకా ఫిక్స్ కాలేదు. గచ్చిబౌలి, పోలీస్ గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియం అంటూ దోబూచు లాడుతోంది.
ఈలోగా ఆడియోను విడుదల చేయడానికి మాత్రం ఓ మాంచి స్పాట్ సెలెక్ట్ చేసారు. అదే మిలటరీ మాధవరం. వెస్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లి గూడెంకు పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో వున్న ఊరు. అక్కడ ప్రతి ఇంటికీ ఓ మిలటరీ వ్యక్తి వుంటారు. అందుకే ఆ ఊరికి మిలటరీ మాధవరం అని పేరు పడింది.
నా పేరు సూర్య మిలట్రీ నేపథ్యంలో తయారవుతున్న సినిమా. ఈ సినిమాలో బన్నీసోల్జర్ గా కనిపిస్తున్నాడు. అందుకే ఈ సినిమా ఆడియో పంక్షన్ ను అక్కడ చేయాలని డిసైడ్ అయ్యారు.
అయితే ఇదేమంత భారీగా వుండదు. యూనిట్ వెళ్లి అక్కడ జనాల మధ్య ఆడియో లాంచ్ చేసి వస్తుంది. అయితే బన్నీ వెళ్లాలా? వద్దా? అన్నిది ఇంకా డిసైడ్ కాలేదు. కానీ దర్శకుడు, నిర్మాత, తదితర జనాలంతా మాత్రం వెళ్తారు.