జనవరి నుంచి వాయిదాలు పడుతూ వస్తోంది ఆచారి అమెరికాయాత్ర సినిమా. వచ్చి వచ్చి ఈ నెల 26డేట్ కు ఫిక్సయింది. అయితే ఆ డేట్ కు అన్నా పక్కాగా వస్తుందా? అన్నది అనుమానమే. అయితే వస్తే మాత్రం లక్కీ డేట్ అంటున్నారు సినిమా జనాలు.
ఎందుకంటే సమ్మర్ హాలీడేస్ తో పాటు వరుస సెలవులు కూడా రావడం ఒక పాయింట్. దానికి మించి, ఈ సమ్మర్ లో రంగస్థలం సినిమాను మినహయిస్తే మిగిలిన వన్నీ సీరియస్ సినిమాలే. ఇటు భరత్ అనే నేను, అటు నా పేరు సూర్య కూడా అలాంటివే. హాయిగా నవ్వేసుకోవడానికి వీలయ్యే సినిమాలు లేవు.
ఆ గ్యాప్ పూడ్చడం ఆచారి వల్ల అయితే, సూపరే. లేదంటే కష్టం. నాగేశ్వరెడ్డి మంచి కామెడీ డైరక్టర్ నే కానీ ఈ మధ్య ఫార్మ్ తగ్గింది. కానీ విష్ణుతో కాంబినేషన్ గతంలో పండింది. అందువల్ల హోప్ వుంది. పైగా దీని ముందుగా విడుదలయ్యే భరత్ అనే నేను సీరియస్ సినిమా కావడం, దీని టైమ్ కు వన్ వీక్ కావడం అన్నది ప్లస్ అవుతుంది.
కానీ ఇవన్నీ కూడా ఆచారి ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుని బయటకు వచ్చినపుడే. అందుకే ఈ సినిమా ప్రచారం గురించి కూడా హీరో విష్ణు కూడా ఇంకా సీరియస్ గా తీసుకోలేదు. వస్తుందని కన్ ఫర్మ్ అయితే అప్పుడు మొదలుపెడతారేమో ప్రచారం.