పెళ్లికి ముందు ఎవ్వరూ ప్రపోజ్ చేయలేదంట

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది మీన. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ లైఫ్ తర్వాత తిరిగి సినిమాల్లోకొచ్చింది. రీఎంట్రీలో కూడా దృశ్యం లాంటి సినిమాలతో హిట్స్ కొట్టింది. ఇప్పుడీ హీరోయిన్ తనకు…

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది మీన. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ లైఫ్ తర్వాత తిరిగి సినిమాల్లోకొచ్చింది. రీఎంట్రీలో కూడా దృశ్యం లాంటి సినిమాలతో హిట్స్ కొట్టింది. ఇప్పుడీ హీరోయిన్ తనకు సంబంధించి ఎవ్వరికీ తెలియని విషయాన్ని బయటపెట్టింది. ఆమెకు పెళ్లికి ముందు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదంట.

“నిజమే.. నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు ఒక్కరు కూడా నన్ను ప్రపోజ్ చేయలేదు. నేను సినిమాలు చేస్తున్న టైమ్ లో అంతా పెద్దవాళ్లు. నేను నటించిన హీరోలు, దర్శకులు, కీలకమైన టెక్నీషియన్స్, అంతా పెద్దవాళ్లే. 

కాబట్టి లవ్ ప్రపోజల్ అనే అవకాశమే లేదు. పైగా నేను నటించిన హీరోలకు, నేను వర్క్ చేసిన దర్శకులకు అప్పటికే పెళ్లిళ్లు అయిపోయాయి. అంతా సెటిల్ అయిపోయారు. అలాంటి వాళ్లతోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను. కాబట్టి పెళ్లికి ముందు నాకు ఎవ్వరూ ప్రపోజ్ చేయలేదు.”

సాధారణంగా హీరోయిన్లకు ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. కానీ మీన మాత్రం తన కెరీర్ లో తనకు అలాంటి అనుభవాలు ఎదురవ్వలేదని చెబుతోంది. మరోవైపు పోటీ గురించి స్పందిస్తూ.. చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికీ తనకు అప్పట్లో రోజా నుంచి గట్టి పోటీ ఉండేదని చెప్పుకొచ్చింది.

“రోజా, రమ్యకృష్ణ, నగ్మా.. వీళ్లు ముగ్గురు అప్పట్లో నాకు గట్టిపోటీ. సౌందర్య, రంభ నాకంటే లేట్ గా వచ్చారు. నాకు గట్టి పోటీ మాత్రం రోజా నుంచే. అన్ని సినిమాల్లో తనే నాకు పోటీ. రోజా చాలా బోల్డ్. అప్పట్లోనే ఆమెకు చాలా ధైర్యం. చెప్పిన టైమ్ కు సినిమా షూటింగ్ అవ్వకపోతే, మరో సినిమా షూటింగ్ కు లేట్ అవుతుందనే ఉద్దేశంతో గోడ దూకి మరీ వెళ్లిపోయేది.”

ఇలా రోజా చేసిన చిలిపి పనుల్ని బయటపెట్టింది మీన. హీరోయిన్ల వల్ల తనకు అవకాశాలు పోలేదని, కానీ కొన్ని మంచి పాటల్ని మాత్రం కోల్పోయానని చెప్పుకొచ్చింది ఈ సీనియర్ నటి. 

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే