మరో ఛాన్స్ మిస్ చేసుకున్న అమలాపాల్

విడాకులు తీసుకున్న తర్వాత ఫ్రెష్ గా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అమలాపాల్, అప్పట్నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. తన వద్ద ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఇప్పటికే కెలికేసింది. ఇందులో భాగంగా…

విడాకులు తీసుకున్న తర్వాత ఫ్రెష్ గా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అమలాపాల్, అప్పట్నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. తన వద్ద ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఇప్పటికే కెలికేసింది. ఇందులో భాగంగా 2అవకాశాలు ఇలా వచ్చి అలా చేజారిపోయాయి. తాజాగా ఇలా చేజారిన అవకాశాల లిస్ట్ లోకి మరో మూవీ చేరింది.

నాగార్జున, నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దీనికి దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జున సరసన అమలాపాల్ ను అనుకున్నారు. ఆ విషయాన్ని అమలాపాల్ కూడా అప్పట్లో పరోక్షంగా నిర్థారించింది. కానీ ఏమైందో ఏమో అంతలోనే ఆమెను తొలిగించారు. అమలాపాల్ స్థానంలో ఆకాంక్ష సింగ్ ను ఎంపిక చేశారు.

హిందీలో వచ్చిన బద్రినాధ్ కి దుల్హనియా సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తెలుగులో సుమంత్ సరసన చేసిన మళ్లీ రావా అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తన రెండో తెలుగు సినిమాగా నాగ్ సరసన నటించబోతోంది. ఆకాంక్ష సింగ్ ఎంట్రీపై త్వరలోనే ఓ ప్రకటన రానుంది.

అమలాపాల్ విషయానికొస్తే టాలీవుడ్ లో ఒకే ఒక్క ఆధారం మిగిలింది. వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా రాబోతున్న ఎఫ్-2అనే సినిమాలో వెంకీ సరసన అమలాపాల్ ను తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఇది కూడా మిస్ అయితే, ఆమె ప్రయత్నాలు మళ్లీ మొదటికొచ్చినట్టే.