రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి ఎటు వుంటే అటే తాను కూడా వుంటానని, స్టయిలిష్ స్టార్ బన్నీ క్లియర్ గా చెప్పేసాడు. ఓ ఇంటర్వూలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చేసాడు.
చిరంజీవి గారిది ఓ మాట, నాది మరో బాట అనేది వుండదని, ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ లో వున్నారని, భవిష్యత్ లో ఆయన ఎటు వెళ్తే, తాను కూడా అటే అని బన్నీ వివరించాడు. మెగాస్టార్ జనసేన వైపు వెళ్తే, తాను కూడా అటే వెళ్తా అన్నాడు.
పవన్ ఫ్యాన్స్, తన ఫ్యాన్స్ మధ్య గొడవలను ప్రస్తావిస్తూ, ఇది కామన్ అని, తాత్కాలికం అని అన్నాడు బన్నీ. గతంలో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కూడా చిరు ఫ్యాన్స్ కు, పవన్ ఫ్యాన్స్ కు మధ్య చిన్న చిన్న విబేధాలు వుండేవని, తరువాత మారిందని వివరించాడు. ఇప్పుడూ అంతే అని క్లారిటీ ఇచ్చాడు.
తన పెళ్లి వ్యవహారం గురించి కూడా వివరిస్తూ, తనది లవ్ మ్యారేజ్ అని అందరూ అనుకుంటారని, అయితే అరేంజ్డ్ మ్యారేజ్ అని కొందరికే తెలుసు అని, సినిమా రంగానికి చెందిన వారిని చేసుకోకూడదు అన్న మైండ్ సెట్ తనదని, అందుకే ఈ రంగంతో అస్సలు సంబంధం లేని అమ్మాయిని చేసుకున్నానని చెప్పేసాడు.
కొడుకు ఆయాన్ కు డ్యాన్స్ ల కన్నా పాటలు అంటే ఇష్టం అని, అందులోనూ దేవీ పాటలు అంటే మరీనూ అని, శ్రీమంతుడు, రంగస్థలం, నేను లోకల్, సన్నాఫ్ సత్యమూర్తి పాటలు తెగ వింటాడని అన్నాడు బన్నీ.