నాగశౌర్య ‘సైంధవ’

ఈ మధ్య హీరోలకు నెగిటివ్ టైటిళ్లు, నెగిటివ్ రోల్స్ మీదకు మనసుపోతోంది. వైవిధ్యమైన సినిమాలు చేసే భాగంలో ఇలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఛలోతో హిట్ కొట్టి, కణంలా లేడీ ఓరియెంటెడ్ సినిమా,…

ఈ మధ్య హీరోలకు నెగిటివ్ టైటిళ్లు, నెగిటివ్ రోల్స్ మీదకు మనసుపోతోంది. వైవిధ్యమైన సినిమాలు చేసే భాగంలో ఇలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఛలోతో హిట్ కొట్టి, కణంలా లేడీ ఓరియెంటెడ్ సినిమా, అమ్మమ్మగారిల్లు అంటూ ఫ్యామిలీ సినిమా చేసిన హీరో నాగశౌర్య 'సైంధవ' అనే టైటిల్ తో మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.

భవ్య క్రియేషన్స్ పతాకంపై రాజా అనే కొత్త దర్శకుడు ఈ సినిమా కోసం వైవిధ్యమైన పాయింట్ తో స్క్రిప్ట్ తయారుచేసాడట. ఆ స్క్రిప్ట్ కు ఈ టైటిల్ పక్కాగా వుంటుందని వెంటనే రిజిస్టర్ చేయించేసారు.

ఇప్పటికే హోమ్ బ్యానర్ పై @నర్తనశాల సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. ప్రతి పనికీ అడ్డం పడేవాడిని సైంధవుడు అనడం కామన్. అలాంటి క్యారెక్టరైజేషన్ తో సైంధవ సినిమా రూపొందుతన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా అనుకుంటున్నట్లు వినికిడి. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. నిర్మాత భవ్య క్రియేషన్స్. జూన్ నేలలో ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది.