ఇది ఎలా పాజిబుల్…’బ్రో’?

నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే 60-70% పెట్టుబడి తిరిగి వచ్చేసింది. Advertisement మంచి ఓపెనింగ్ వచ్చింది. ప్రొడ్యూసర్‌గా బ్రో సినిమాతో హ్యాపీ. అంటున్నారు నిర్మాత విశ్వప్రసాద్.. కానీ.. ఎలా.? హౌ.? నాన్ థియేటర్ హక్కులు…

నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే 60-70% పెట్టుబడి తిరిగి వచ్చేసింది.

మంచి ఓపెనింగ్ వచ్చింది.

ప్రొడ్యూసర్‌గా బ్రో సినిమాతో హ్యాపీ. అంటున్నారు నిర్మాత విశ్వప్రసాద్.. కానీ.. ఎలా.? హౌ.?

నాన్ థియేటర్ హక్కులు వంద కోట్ల వరకు వచ్చాయి అన్నది ఇండస్ట్రీ సమాచారం. థియేటర్ హక్కులు నైజాం 33 కోట్లు.. ఆంధ్ర 40.. సీడెడ్ 14… ఓవర్ సీస్ 13 అని తెలుస్తోంది. అంటే వందకోట్లు… అంటే టోటల్ రెవెన్యూ 200 వందల కోట్లు అనుకోవాల్సిందే.

ఈ సంగతి అలా వుంచితే, పవన్, సాయి ధరమ్ తేజ్, త్రివిక్రమ్, థమన్, సముద్రఖని, హీరోయిన్లు వీళ్ల రెమ్యూనిరేషన్లే 100 కోట్లు అయ్యాయని తెలుస్తోంది. సినిమా ఖర్చు, ప్రింట్, పబ్లిసిటీ, వడ్డీలు అన్నీ కలిపి కనీసం 50 కోట్లకు తక్కువ కాదు. అంటే నికరంగా మిగిలింది 50 కోట్లు. అందులో సందేహం లేదు.

కానీ… ఓవర్ సీస్ ఓన్ రిలీజ్. కృష్ణా జిల్లా ఓన్ రిలీజ్. సీడెడ్‌లో సినిమా చాలా అంటే చాలా వీక్ గా వుంది. కనీసం సగానికి సగం తేడా వస్తుంది అని బయ్యర్ల సర్కిల్ టాక్. ఆంధ్రలోని కొన్ని ఏరియాలు కూడా ఇదే పరిస్థితి అని లెక్కలు చెబుతున్నారు. కానీ ఈవారం సరైన సినిమా లేదు కనుక పాస్ అయిపోతుందని అని ధీమా వుంది. ఇక నైజాం జీఎస్టీతో కలిపి 33 కోట్లు చేయాల్సి వుంది. ఇప్పటికి జిఎస్టీతో కలిపి 20 కు చేరలేదు.

ఇప్పుడు అన్ని ఏరియాలకు జీఎస్టీలు వెనక్కు ఇవ్వాల్సి వుంది. జీఎస్టీల మొత్తమే దాదాపు 18 కోట్లు నిర్మాత కట్టుకోవాలి. ఓవర్ సీస్ డెఫిసిట్ కనీసం 20శాతం మించి డెఫిసిట్ వస్తే వెనక్కు ఇవాల్సిందే. ఈ సినిమా మీద కాకున్నా రాబోయే సినిమాల మీద అయినా. టాలీవుడ్‌లో అదో పద్దతి.

అమ్మకాలు పెట్టుబడిలో మిగిలిన బ్యాలన్స్ నుంచి ఈ జీఎస్టీలు, డెఫిసిట్ లు అన్నీ తీసేయాల్సి వుంటుంది. అందువల్ల చివరకు సినిమా నిర్మాతకు ఓ మంచి సినిమా తీసామనే ఆనందం వుంటుంది. హీరోకి, రచయిత త్రివిక్రమ్ కు మాత్రం ఫుల్ హ్యాపీగా వుంటుంది.