అఖిల్ రుమాలు వేస్తున్నాడా?

హిట్ అయితే అందరూ చుట్టాలే. ఫ్లాప్ అయితే ఫోన్ కాల్స్ అన్నీ నో రిప్లయ్ లే. ఇది టాలీవుడ్ లో కామన్. సుకుమార్ ఇప్పుడు మరోసారి మాంచి మేకర్ గా ప్రూవ్ చేసుకున్నారు. Advertisement…

హిట్ అయితే అందరూ చుట్టాలే. ఫ్లాప్ అయితే ఫోన్ కాల్స్ అన్నీ నో రిప్లయ్ లే. ఇది టాలీవుడ్ లో కామన్. సుకుమార్ ఇప్పుడు మరోసారి మాంచి మేకర్ గా ప్రూవ్ చేసుకున్నారు.

రంగస్థలం సినిమాకు మాంచి అప్లాజ్ వచ్చింది. ఇండస్ట్రీలో ఇప్పుడు చేతిలో మరో సినిమా లేని ఏకైక టాప్ డైరక్టర్ సుకుమార్ నే. ఆయన తరువాత సినిమాను కూడా మైత్రీ మూవీస్ కే చేయాల్సివుంది. కానీ హీరో ఎవరు అన్నది ఇంకా తేలలేదు.

మైత్రీ మూవీస్ కు బన్నీతో చేయాలని వుంది. మరి రంగస్థలం సినిమాకు అప్లాజ్ వచ్చింది కాబట్టి, బన్నీకి కూడా సినిమా ఏదీ చేతిలో లేదు కాబట్టి ఒకె అంటారేమో తెలియదు.

ఈలోగా హీరో అఖిల్ మాత్రం సుకమార్ ను లైన్లో పెట్టుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో కూడా ఒక సారి సుకుమార్-అఖిల్ సినిమాపై గ్యాసిప్ లు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా అఖిల్ ఓ ట్వీట్ చేసాడు. ఎవరికి తెలుసు? త్వరలో నేను సుకుమార్ కలిసి దేనిమీదయినా పనిచేస్తామేమో? అంటూ ట్వీట్ చేసాడు. 

అంటే అఖిల్ తన ఫ్రెండ్ రామ్ చరణ్ సాయంతో సుకుమార్ తో ప్రాజెక్టు ఫైనల్ చేసుకునే ప్రయత్నంలో వున్నట్లుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.