ఆహా …ఏమి సెప్తిరి ఏమి సెప్తిరి!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల‌కు, సినిమాల‌కు పెద్ద తేడా లేద‌ని న‌మ్ముతున్న‌ట్టున్నారు. ఎక్క‌డైనా న‌ట‌నే క‌దా అని భావించిన‌ట్టున్నారు. సీరియ‌స్‌గా రాజ‌కీయాలు చేసే వారెవ‌రైనా ప్ర‌తి ఎన్నిక‌ను స‌వాల్‌గా తీసుకుంటారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల‌కు, సినిమాల‌కు పెద్ద తేడా లేద‌ని న‌మ్ముతున్న‌ట్టున్నారు. ఎక్క‌డైనా న‌ట‌నే క‌దా అని భావించిన‌ట్టున్నారు. సీరియ‌స్‌గా రాజ‌కీయాలు చేసే వారెవ‌రైనా ప్ర‌తి ఎన్నిక‌ను స‌వాల్‌గా తీసుకుంటారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసిన త‌ర్వాత కూడా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనైనా కొద్దోగొప్పో స‌త్తా చాటాల‌ని శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తోంది.

70 ఏళ్లు పైబ‌డిన వ‌య‌సులో కూడా చంద్ర‌బాబు అలుపెర‌గ‌కుండా ఊరూరూ తిరుగుతూ ముమ్మ‌ర ప్ర‌చారం చేస్తున్నారు. బాబు రాజ‌కీయ అభిప్రాయాల‌తో విభేదించే వాళ్లు కూడా, ఆయ‌న ప్ర‌య‌త్నాల్ని త‌ప్పు ప‌ట్ట‌లేరు. పొలిటిక‌ల్ స్పిరిట్ అంటే ఇదే. కానీ రాష్ట్రాన్ని సుడిగాలిలా చుట్టేందుకు వ‌య‌సు, ఆరోగ్యం స‌హ‌క‌రిస్తున్నా, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీ -జ‌న‌సేన కూట‌మికి ఓటు వేయాల‌ని ఓ వీడియో సందేశాన్ని విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

దీన్ని బ‌ట్టి రాజ‌కీయాల‌ను ఆయ‌న ఎంత సీరియ‌స్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. ఇంట్లో కూచుని ఊరికే మాట‌లు చెబితే స‌మాజంలో మార్పు వ‌స్తుందా? ల‌క్ష‌లాది పుస్త‌కాలు చ‌దివాన‌ని చెప్పుకునే ప‌వ‌న్‌కు ఆ మాత్రం తెలియ‌దా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

‘మున్సిపల్‌ ఎన్నికల్లో దయచేసి వైకాపా నాయకులకు ఓటు వేయవద్దు. వాళ్లు ఇచ్చే నోట్లకు ఆశపడి ఓట్లు వేస్తే మనల్ని యాచించే స్థాయికి తీసుకువెళ్తారు. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధంగా తిరగబడాలి. ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  

‘పంచాయతీ ఎన్నికల కన్నా పదింతల బీభత్సం మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ నాయకులు సృష్టించారు. వీరి ధాటికి కాకలు తీరిన రాజకీయ పార్టీలే నిలబడలేకపోయాయి. జనసేన అభ్యర్థులను బెదిరించినా వారి దాష్టీకాలకు ఎదురొడ్డి యుద్ధం చేయగల సత్తా మా సైనికులకు ఉంది. ఆ యువబలమే మున్సిపల్‌ ఎన్నికల్లో ధైర్యంగా నిలబడింది. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీతో కలిసి జనసేన మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. మా కూటమికి మద్దతు ఇవ్వండి.. మేము అండగా నిలబడతాం’ అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.

అండ‌గా నిల‌బ‌డ‌డం అంటే ఇదేనా? ఒక‌వైపు ఇదే వీడియోలో అధికారి పార్టీ నేత‌లు ప్ర‌త్య‌ర్థుల‌పై బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోపించారు. అలాంటప్పుడు పార్టీ శ్రేణుల‌తో పాటు సామాన్య ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించాలంటే వీడియో సందేశాలు స‌రిపోతాయా?  నేరుగా బాధితుల ద‌గ్గ‌రికి వెళ్లి భ‌రోసా ఇచ్చే ఓపిక కూడా ప‌వ‌న్‌కు లేదా? ఇదేనా స‌మాజంలో మార్పు తీసుకొచ్చే విధానం? ఇప్ప‌టికైనా ఒట్టి మాట‌లు క‌ట్టిపెట్టి గ‌ట్టిమేలు త‌ల‌పెట్టే చ‌ర్య‌ల‌కు ప‌వ‌న్ శ్రీ‌కారం చుట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. 

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే