మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కుతోంది!

హీరోయిన్లకు ఇది పెళ్లి సీజన్లా ఉంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ హీరోయిన్లు వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. సమంతా, అనుష్కా శర్మ, శ్రియ.. వంటి వాళ్ల పెళ్లిళ్లు అయిపోగా, ఇప్పుడు మరో హీరోయిన్…

హీరోయిన్లకు ఇది పెళ్లి సీజన్లా ఉంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ హీరోయిన్లు వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. సమంతా, అనుష్కా శర్మ, శ్రియ.. వంటి వాళ్ల పెళ్లిళ్లు అయిపోగా, ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతోందని సమాచారం. ఆమె మరెవరో కాదు.. సోనమ్ కపూర్.

ఈ బాలీవుడ్ తారకు పెళ్లి ఫిక్సయ్యిందని, డేట్లు కూడా ఖరారు అయ్యాయని, డెస్టినేషన్ వెడ్డింగ్ తో సోనమ్ వైవాహిక జీవితంలోకి ప్రవేశించబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే.. మే 11,12తేదీల్లో సోనమ్ కపూర్ వివాహం జరగనుంది.

విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకున్న బాలీవుడ్ జనాల్లా ఈమె పెళ్లి జెనీవాలో జరగనుందని సమాచారం. దాదాపు దశాబ్దం కిందట భన్సాలీ సినిమా ‘సావరియా’తో సోనమ్ కపూర్ బాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

అనిల్ కపూర్ కూతురు అనే ఇమేజ్ ఈమెకు ఉపయోగపడింది. అయితే సరైన హిట్లు లేక అంతగా రాణించలేకపోయింది సోనమ్. అయితే కొంత కాలం కిందట ‘నీర్జా’ సినిమాతో ప్రశంసలు పొందింది.

అయితే ఆ తర్వాత మాత్రం ఈమెకు అంతగా అవకాశాలు రాలేదు. ఇదే సమయంలో వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజాతో సోనమ్ ప్రేమాయణాన్ని సాగించింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీళ్లిద్దరే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది.