చెర్రీ బర్త్ డే: స్పెషల్ గిఫ్ట్ ఏంటి?

మరో 3రోజుల్లో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు రామ్ చరణ్. మరి ఈ బర్త్ డేకు ఫ్యాన్స్ కు ఎలాంటి గిఫ్ట్ అందివ్వబోతున్నాడు? మరీ ముఖ్యంగా రాజమౌళితో సినిమా ఎనౌన్స్ చేసిన ఈ తరుణంలో…

మరో 3రోజుల్లో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు రామ్ చరణ్. మరి ఈ బర్త్ డేకు ఫ్యాన్స్ కు ఎలాంటి గిఫ్ట్ అందివ్వబోతున్నాడు? మరీ ముఖ్యంగా రాజమౌళితో సినిమా ఎనౌన్స్ చేసిన ఈ తరుణంలో అటువైపు నుంచి అదిరిపోయే గిఫ్ట్ బయటకొచ్చే ఛాన్స్ ఉందంటూ ఊహిస్తున్నారంతా.

బాహుబలి షూటింగ్ టైమ్ లో యూనిట్ కు సంబంధించిన కీలకమైన నటీనటుల పుట్టినరోజులన్నీ ఫస్ట్ లుక్స్ తో సెలబ్రేట్ చేశాడు జక్కన్న. అనుష్క, ప్రభాస్, రానా, తమన్న.. ఇలా నటీనటుల పుట్టినరోజుల నాడు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశాడు. అలాగే చరణ్ పుట్టినరోజున కూడా అలాంటి ఓ స్టిల్ రిలీజ్ చేస్తాడేమోనని అంతా వెయిటింగ్.

ఈమధ్యే చరణ్, ఎన్టీఆర్ కలిసి అమెరికా వెళ్లారు. రాజమౌళి తీయబోతున్న మల్టీస్టారర్ మూవీకి సంబంధించి అక్కడ టెస్ట్ కట్ చేశారు. ఆ ఫొటో సెషన్ కు సంబంధించిన స్టిల్ ను బర్త్ డే గిఫ్ట్ గా రాజమౌళి రిలీజ్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది.

మరోవైపు రంగస్థలం సినిమా నుంచి మరో డిఫరెంట్ ప్రోమోను విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బోయపాటి సినిమాతో పాటు సైరా నుంచి కూడా ఓ స్పెషల్ గిఫ్ట్ వస్తుందేమో చూడాలి.