విజయవాడకు మారిన భరత్ ఆడియో

భరత్ అనే నేను ఆడియో ఫంక్షన్ వెన్యూ మారింది. విశాఖలో ఫంక్షన్ చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని విజయవాడ-గుంటూరు మధ్యలోకి మార్చారు. ఏప్రియల్ ఫస్ట్ వీక్ లో భరత్ అనే నేను ఆడియో…

భరత్ అనే నేను ఆడియో ఫంక్షన్ వెన్యూ మారింది. విశాఖలో ఫంక్షన్ చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని విజయవాడ-గుంటూరు మధ్యలోకి మార్చారు. ఏప్రియల్ ఫస్ట్ వీక్ లో భరత్ అనే నేను ఆడియో ఫంక్షన్ విశాఖలో ప్లాన్ చేసారు. అయితే బీచ్ రోడ్ లో మొన్నటికి మొన్న రంగస్థలం సినిమా టైమ్ లో గొడవ జరిగింది. 

హోదా మీద మాట్లాడకుండా రంగస్థలం సినిమా ఫంక్షన్ చేస్తారా? అంటూ మెగాస్టార్ మీదకు జనాలు ధర్నాకు వచ్చారు. మహేష్ బాబు కూడా ఇప్పటి వరకు హోదా మీద గొంతు విప్పలేదు. అందువల్ల ఇప్పుడు అక్కడ కూడా అలాంటి వ్యవహారం ఏమన్నా అనే వుంటుందా అన్న అనుమానం వుంది.

అదీ కాక మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గుంటూరు ప్రాంతంలోనే భారీ సభ చేసి, కాస్త హల్ చల్ చేసాడు. అక్కడ ఎంపీ ఎవరో కాదు, మహేష్ బావ గల్లా జయదేవ్. అసలే భాజపా, జనసేన, వైకాపా దాటికి తెలుదుగదేశం పార్టీ కిందా మీదా అవుతోంది. ఇలాంటి టైమ్ లో మహేష్ బాబు అక్కడికి వస్తే, కాస్తయినా ఉపయోగం వుంటుంది బావ జయదేవ్ కు.

ఇక దర్శకుడు కొరటాల శివకు ఆ ప్రాంతం అంటే మంచి అభిమానం. పైగా ఆయన సన్నిహితుడు సుధాకర్ ఆ ప్రాంతాలకు బయ్యర్. అన్నింటికి మించి తరచు ఏదో ఒక ఫంక్షన్ జరగుతూ వుంటే అమరావతి ప్రాంతం రియల్ ఎస్టేట్ పెరగాలి. ఇలా అన్ని విధాలా బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఉపయోగపడుతుంది భరత్ అనే నేను ఆడియో ఫంక్షన్ అక్కడ చేయడం. బహుశా అన్నీ ఆలోచించి మార్చి వుంటారు.