ఎమ్మెల్యే ఓపెనింగ్స్ ఓకె

కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్ తన ఇజమ్ సినిమాకు. దాదాపు మూడుకోట్ల వరకు తొలి రోజు వసూళ్లు వచ్చాయి అప్పుడు. మళ్లీ లేటెస్ట్ గా ఎమ్మెల్యే సినిమాతో మంచి ఓపెనింగ్స్…

కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్ తన ఇజమ్ సినిమాకు. దాదాపు మూడుకోట్ల వరకు తొలి రోజు వసూళ్లు వచ్చాయి అప్పుడు. మళ్లీ లేటెస్ట్ గా ఎమ్మెల్యే సినిమాతో మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఫస్ట్ డేన 3.05 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ గా వచ్చింది ఎమ్మెల్యేకు.

బ్లూ ప్లానెట్, పీపుల్స్ మీడియా వంటి బ్యానర్ లు తోడు కావడం, పబ్లిసిటీ బాగా చేయడంతో మాంచి ఓపెనింగ్స్ అందుకుంది. అయితే క్రిటిక్స్ లెవెల్ లో టాక్ సరిగ్గా లేదు కానీ, గ్రౌండ్ లెవెల్లో ఫరవాలేదు అనే రేంజ్ లో వుంది. దీనికి తోడు సోమవారం సెలవు ప్రకటించారు.

అందువల్ల ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజులు కాస్త బాగానే వసూలు చేసుకునే అవకాశం వుంది. సినిమా మరీ బ్యాడ్ మూవీగా అయితే గ్రౌండ్ లెవెల్ లో టాక్ రాలేదు కాబట్టి, చాలా నామినల్ రేట్లకు అమ్మారు కాబట్టి, ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజులకు కలిపి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు వున్నాయి. వైజాగా 1.10 కోట్లకు, గుంటూరు 95లక్షలకు అమ్మారు. వైజాగ్ లో ఫస్ట్ డే 32లక్షల వరకు, గుంటూరులో 33లక్షలు వసూలు చేసింది.

ఫస్ట్ డే కలెక్షన్ వివరాలు ఇలా వున్నాయి.

నైజాం – 86,35,557
సీడెడ్ – 50,00,000
నెల్లూరు – 9,00,000
గుంటూరు – 33,88,620
కృష్ణా – 18,25,257
వెస్ట్ – 12,00,000
ఈస్ట్ – 28,50,496
ఉత్తరఆంధ్ర – 31,88,625