మహేష్ తో ఫొటోలే ఫొటోలు

పెద్ద సినిమా విడుదలవుతోంది అంటే హీరోలకు ఓ వ్యవహారం అని కాదు. సినిమా మీద ఎంత కష్టపడాలో, సినిమా కోసం అంతకు అంతా కష్టపడాలి. చిన్న, మిడిల్ హీరోలయితే కాలేజీల చుట్టూ, థియేటర్ల చుట్టూ…

పెద్ద సినిమా విడుదలవుతోంది అంటే హీరోలకు ఓ వ్యవహారం అని కాదు. సినిమా మీద ఎంత కష్టపడాలో, సినిమా కోసం అంతకు అంతా కష్టపడాలి. చిన్న, మిడిల్ హీరోలయితే కాలేజీల చుట్టూ, థియేటర్ల చుట్టూ తిరుగుతారు. ఆపై టీవీ స్టూడియోలకు వెళ్లి నానా రకాల షోల్లో పాల్గోని, పాపం, వాళ్లు ఆడమన్నట్లు ఆడతారు. పాడమన్నట్లు పాడతారు. గెంతమన్నట్లు గెంతుతారు.

కానీ పెద్ద హీరోల స్ట్రాటజీలు వేరే వుంటాయి. ఊళ్లవారీ అభిమానులను రప్పించి కలవడం, అభిమానులతో సమావేశాలు నిర్వహించడం ఇలాంటివి జరుగుతూ వుంటాయి. జనతా గ్యారేజ్ టైమ్ లో పని గట్టుకుని ఎన్టీఆర్ అభిమానులందరినీ కలిసాడు. మెగా హీరోలు కూడా తమ సినిమాల ముందు అభిమానులతో సమావేశం కావడం, వారికి లంచ్ ఏర్పాట్లుచేయడం చేస్తుంటారు.

ఇప్పుడు మహేష్ బాబు టెర్మ్ వచ్చింది. బ్రహ్మొత్సవం, స్పైడర్ పరాజయాల తరువాత చేస్తున్న సినిమా ఇది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 18నుంచి నాలుగు రోజుల పాటు అభిమానులను కలిసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోజుకు 400మందిని కలుస్తున్నారు.

సింగిల్ గా లేదూ అంటే ఇద్దరితో, కాదూ అంటే ముగ్గురితో, మాగ్జిమమ్ ఒక గ్రూప్ అంటే నలుగురితో కలిసి మహేష్ ఓపికగా ఫోటొలు దిగుతున్నారు. గంటల కొద్దీ సాగుతోంది ఈ కార్యక్రమం. ఆదివారం, సోమవారం జరిగింది. మంగళ, బుదవారాలు కూడా జరుగుతుంది. అంటే దాదాపు 1600మంది ఫ్యాన్స్ ను వ్యక్తిగతంగా కలుస్తారన్న మాట మహేష్ బాబు.

కేవలం కలవడమే కాదు, వచ్చిన వారందరికీ కాఫీలు, టిఫెన్లు కూడా మహేష్ కు చెందిన ఎంబీ కార్పొరేషన్ టీమ్ ఏర్పాటు చేస్తోంది.