ఆఫీసర్ వెనక్కు తగ్గుతాడా?

నాగ్-వర్మ కాంబో సినిమా ఆఫీసర్. ఈ సినిమాకు మే 25డేట్ ఇచ్చేసారు. పైగా అదే రోజు మరో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి రవితేజ నేల టికెట్. మరోటి కళ్యాణ్ రామ్ ‘నా…

నాగ్-వర్మ కాంబో సినిమా ఆఫీసర్. ఈ సినిమాకు మే 25డేట్ ఇచ్చేసారు. పైగా అదే రోజు మరో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి రవితేజ నేల టికెట్. మరోటి కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’. అయితే మూడు సినిమాలు ఒక జోనర్ కాదు. దేని వ్యవహారం దానిదే. ఆఫీసర్ అన్నది క్రైం యాక్షన్ ఎంటర్ టైనర్. రవితేజ నేలటికెట్ మాస్ ఎంటర్ టైనర్. కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ క్లాస్ లవ్ స్టోరీ. ఒక దానికి మరోటి కాంపిటీషన్ అనుకోవడానికి లేదు. అయినా కూడా కలెక్షన్లు చీలిపోతాయమనే చిన్న భయం వుండనే వుంటుంది.

ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఆఫీసర్ సినిమా మే 25న రాదేమో? అని. దానికి కారణం, ఆ సినిమా తెలుగు హక్కులు ఇంకా అమ్ముడు కాకపోవడమే అని వినిపిస్తోంది. ఆ మధ్య ఓ బయ్యర్ ఓన్లీ తెలుగు రైట్స్ 12 నుంచి 13కోట్ల రేటుకు కొనడానికి ముందుకు వచ్చారు. అమ్ముడుపోయిందని వార్తలు వినవచ్చాయి.

కానీ ఎవరికీ అమ్మలేదని అంతలోనే ఖండనలు కూడా వచ్చాయి. దానికి కారణం, ఎవరైతే కొనడానికి ముందుకు వచ్చారో, ఆ పార్టీ సరైనది కాదని ఫీడ్ బ్యాక్ రావడం వల్లనే ఆర్జీవీ వెనకడుగు వేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎప్పుడైతే ఓ డీల్ తేడా వచ్చిందో? ఓ ఫిగర్ బయటకు వచ్చిందో, ఇంకెవరు కొనడానికి ముందుకు రావడం లేదని ఇండస్డ్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగ్ లాంటి సీనియర్ హీరో రెండు తెలుగు రాష్ట్రాల్లో 12కోట్ల రేటు పలకకపోవడం ఏమిటి? మీడియం హీరోల సినిమాలే ఆంధ్ర అయిదారు కోట్ల నుంచి పది కోట్ల రేషియోలో అమ్ముతున్నారు. ఇక సీడెడ్, నైజాం సరేసరి. మరి నాగ్ సినిమాకు ఎందుకు ఇలా?

కేవలం రామ్ గోపాల్ వర్మ ట్రాక్ రికార్డు సరిగ్గా లేకపోవడం వల్లనే అన్నది సమాధానంగా వినిపిస్తోంది. అందుకే పూర్తిగా ప్రొడక్ట్ ఫైనల్ చేసి, పస్ట్ కాపీ రెడీ అయిన తరువాత చూపించి అమ్మాలని, అలా అయితే  మంచి రేటు వస్తుందని ఆర్జీవీ భావిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి.

కానీ అలా చేయాలంటే మే 25 డేట్ సరిపోతుందా? అన్నది అనుమానం. పైగా రవితేజ లాంటి మాస్ హీరో, మాస్ సినిమా వస్తుంటే రేటు పలకదు. అందువల్ల డేట్ మారుస్తారని వినిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందేమో?