పవన్.. పోస్ట్ పెయిడ్ నా? ప్రీ పెయిడ్ నా?

పాపం, పవన్ కళ్యాణ్ విషయంలో ఒక విషయం మాత్రం పక్కా అయిపోతోంది. పెయిడ్ సర్వీస్ పొలిటీషియన్ అన్న అపవాదు బలంగా పడుతోంది. నిన్నటి దాకా తెలుగుదేశం మినహా మిగిలిన పార్టీలు ప్యాకేజ్.. ప్యాకేజ్ అనేవి.…

పాపం, పవన్ కళ్యాణ్ విషయంలో ఒక విషయం మాత్రం పక్కా అయిపోతోంది. పెయిడ్ సర్వీస్ పొలిటీషియన్ అన్న అపవాదు బలంగా పడుతోంది. నిన్నటి దాకా తెలుగుదేశం మినహా మిగిలిన పార్టీలు ప్యాకేజ్.. ప్యాకేజ్ అనేవి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ అంటోంది. తెలుగుదేశం పార్టీ జనాలు పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడడం ఎక్కువ చేసాయి.

పవన్ కళ్యాణ్ అంటే పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ టైపు అని తెలుగుదేశం జనాలు అంటున్నారు. పోస్ట్ పెయిడ్ అంటే పని జరిగాక పేమెంట్. ప్రీ పెయిడ్ అంటే పనికి ముందు పేమెంట్. ఈ లెక్కన చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రీ పెయిడ్ చేసి వుండాలి. ఇప్పుడు భాజపానో, వైకాపానో పోస్ట్ పెయిడ్ చేసి వుండాలి. మొత్తానికి ఎవరు చేసినా, పెయిడ్ ఆరోపణలు మాత్రం తగ్గడం లేదు.

పవన్ కు కనీస రాజకీయ పరిజ్ఞానం లేదని, సినిమా స్క్రిప్ట్ కు, రాజకీయ ప్రసంగానికి తేడా తెలియదని, అజ్ఞానవాసి అని దుమ్మెత్తి పోస్తున్నాయి తెలుగుదేశం నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి, అసలు తనను, తన కొడుకును తిట్టడమే, పవన్ చేసిన అతి పెద్ద తప్పు అంటూ క్లారిటీ ఇచ్చారు. అంటే వాళ్లను తిట్టకుండా మరేం మాట్లాడినా తప్పు కాదేమో?

మరోపక్క తెలుగుదేశం పార్టీలోని బిసిలు, కాపు నాయకులే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి ఎగబడడం విశేషం. ఆ పార్టీలో కీలకంగా వుండే కమ్మ సామాజిక వర్గ నాయకులు మాత్రం మౌనంగా వుంటున్నారు. అదేమిటో మరి?