Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎమ్మెల్యే కోసం బాలయ్య వస్తారా?

ఎమ్మెల్యే కోసం బాలయ్య వస్తారా?

ఎమ్మెల్యే అడియో ఫంక్షన్ ఇక కొద్ది రోజుల్లో వుంది. ఈ ఫంక్షన్ కు ఎన్టీఆర్ హాజరుకావడం లేదు. ఎందుకంటే ఆయన ఫ్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం ఫ్రత్యేకంగా రెడీ అవుతున్నారు. ఆ ఫిట్ నెస్, ఆ గెటప్ అదంతా వేరు. ఇప్పుడు సోదరుడు కళ్యాణ్ రామ్ సినిమా ఫంక్షన్ కు హాజరయితే అది రివీల్ అయిపోతుంది. ఇంట్లో జనాలకు విషయం తెలుసు కాబట్టి, రాకఫోయినా, ఎందుకు రాలేదన్నది సమస్యకాదు.

కానీ ఇప్పుడు సమస్య కళ్యాణ్ రామ్ ది. ఎవర్ని చీఫ్ గెస్ట్ గా పిలవాలి? బాబాయ్ బాలయ్యతో మంచి సంబంధాలే వున్నాయి. వెళ్లి అడిగే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలయిన బ్లూ ప్లానెట్, పీపుల్స్ మీడియాకు ఇండస్ట్రీతో మంచి సంబంధాలు వున్నాయి. వాళ్లు అడిగితే చాలామంది సెలబ్రిటీలే వస్తారు. కానీ ఇక్కడ నందమూరి సినిమా. అందువల్ల బాలయ్య వైపు దృష్టి వుంటుంది. బాలయ్యను రప్పించే ఆలోచనలో కళ్యాణ్ రామ్ వున్నారని, వీలు చూసుకుని, బాలయ్య టైమ్ చూసుకుని, వెళ్లి మాట్లాడతారని తెలుస్తోంది.

అది వర్కవుట్ కాకపోతే, హీరో కనుక ఆప్షన్ నిర్మాతలకు వదిలేస్తే, ఎవర్ని తీసుకువస్తారో మరి? తేజ, కోనవెంకట్, రానా, సురేష్ బాబు, వెంకటేష్ ఇలా జాబితా చాలానే వుంటుంది. కానీ కళ్యాణ్ రామ్ మనసును బట్టి కూడా వుంటుంది వ్యవహారం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?