Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ సినిమా ఇలా పుట్టింది

ఆ సినిమా ఇలా పుట్టింది

వెంకీ-నాగచైతన్య సినిమా మొత్తానికి తెరపైకి రావడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కానీ ఈ సినిమా అస్సలు ఓకె అయి, ఓ స్టేజ్ కు రావడానికే ఎన్నో అవరోథాలు దాటాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ వున్నది సురేష్ బాబు. ఆయనకు అన్ని విధాలా నచ్చితే కానీ ఓకే కాదు. ఈ సినిమా వ్యవహారం కూడా అలాంటిదే.

అసలు ఈ కథ జనార్థన మహర్షి దగ్గర స్టార్ట్ అయింది. మేనమామ, మేనల్లుళ్ల కథ ఒకటి ఆయన తయారుచేసారు. ఇదేదో బాగుందని పీపుల్స్ మీడియా జనాలు జనార్థన మహర్షిని తిన్నగా సురేష్ బాబు దగ్గరకు తీసుకెళ్లారు. లైన్ బాగుంది కానీ, ఇంకా బాగా చేయాలి అన్నారు. అప్పుడు కొంత టైమ్ తీసుకుని మళ్లీ మార్పులు చేసారు. అయినా సురేష్ బాబుకు ఇంకా ఏదో కావాలి అనివుంది. అదే టైమ్ లో చైతూతో సినిమా ఆలోచన వున్న కోన వెంకట్ ఎంటర్ అయ్యారు. ఆయన కొన్ని సిటింగ్ లు వేసారు. దాంతో కథ ఓ రూపు దాల్చింది.

సురేష్ బాబు ఈ కథకు కళ్యాణ్ కృష్ణ అయితే బెటర్ అని సూచించారు. అప్పుడు కళ్యాణ్ కృష్ణ రంగప్రవేశం చేసారు. తాను కథ ఇంప్రూవ్ అయితే చేస్తానని, కానీ ఇప్పుడే డైరక్షన్ మాత్రం సాధ్యంకాదని, నాగ్ బంగార్రాజు సినిమా కావాల్సిందే అని అన్నారు. కళ్యాణ్ కృష్ణ ఎప్పుడైతే మార్పులు చేసారో, సురేష్ బాబు, వెంకీ పూర్తిగా రెడీ అయిపోయారు. అప్పుడు సురేష్ బాబు నిర్మాతగా ఎంటర్ అయ్యారు.

అప్పటికే నేనేరాజు నేనే మంత్రి ఇదే విధంగా చేసారు. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ తో వెంకీ-తేజ సినిమా కూడా ఇలాగే చేస్తున్నారు. సో, ఈ సినిమా కూడా సురేష్ బాబు భాగస్వామిగానే చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ డైరక్టర్ ఎవరు? ఈసారి శ్రీవాస్ ఎంటర్ అయ్యారు. ఆయన కూడా తను ఇప్పుడే చేయలేను అన్నారు. పైగా వేరే కథ కాదు, తన స్వంత కథలు వున్నాయి అంటూ ఓ లైన్ చెప్పారు. అది రానాకు నచ్చింది. మనం చేద్దాం అలా వుంచండి అనేసారు.

దాంతో మళ్లీ డైరక్టర్ వెదుకులాట ప్రారంభమైంది. జైలవకుశ సినిమాలో హ్యమన్ ఎమోషన్లు బాగానే పండించిన బాబీ మీద దృష్టి పడింది. ప్రాజెక్టు ఫైనల్ అయింది. ఈ సినిమా మొత్తం పల్లెటూరి నేఫథ్యంలో నడుస్తుంది. ఒక్క పది నిమషాల ఎపిసోడ్ నార్త్ బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. అదీ కథ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?