Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆఫీసర్ కు నేలటిక్కెట్టు చూపిస్తాడా..?

ఆఫీసర్ కు నేలటిక్కెట్టు చూపిస్తాడా..?

ఆఫీసర్ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవ్. ఒకప్పటి శివ సినిమాలా నాగ్-ఆర్జీవీ కాంబినేషన్ ట్రెండ్ సృష్టిస్తుందనే భ్రమలు అస్సలు లేవు. ఇద్దరూ కలిసి ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు, బాగుంటే చూద్దాం అనే ఫీలింగ్ లోనే జనాలున్నారు.

అందుకే బజ్ లేని ఈ సినిమాను పోటీలేని టైమ్ లో విడుదల చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు నాగార్జున. దీనికోసం ఏకంగా తన కొడుకు నాగచైతన్య నటిస్తున్న సవ్యసాచి సినిమాను కూడా పోస్ట్ పోన్ చేయించాడు. అలా ఆఫీసర్ సినిమాను మే 25న సోలోగా విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాడు నాగ్. కానీ అతడి ప్రయత్నాలకు రవితేజ అడ్డుగా మారాడు.

అవును.. నాగ్ నటించిన ఆఫీసర్ సినిమాకు పోటీగా రవితేజ నటిస్తున్న నేలటిక్కెట్టు రాబోతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా మే 25నే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే కనుక జరిగితే రవితేజ, నాగ్ సినిమాల మధ్య పోటీ తప్పదు.

అయితే నాగ్ కు రవితేజ మాత్రమే కాదు, కల్యాణ్ రామ్ రూపంలో కూడా పోటీ ఉండనే ఉంది. కల్యాణ్ రామ్ చేస్తున్న నా నువ్వే సినిమాను కూడా మే 25నే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అప్పటికి పోటీ నుంచి ఏదో ఒక సినిమా తప్పుకున్నప్పటికీ.. నాగ్ కు మాత్రం సోలో రిలీజ్ ఛాన్స్ లేనట్టే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?