ఆ స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదా?

ఎక్కడైనా బావే కానీ, వంగతోట దగ్గర కాదన్న బాపతు దగ్గుబాటి సురేష్ వ్యవహారం. బిజినెస్ దగ్గర రాజీ, మొహమాటం అన్నది వుండదు ఆయనకు. అందులోనూ స్క్రిప్ట్ దగ్గర అస్సలు ఒక్క శాతం కూడా ఆయన…

ఎక్కడైనా బావే కానీ, వంగతోట దగ్గర కాదన్న బాపతు దగ్గుబాటి సురేష్ వ్యవహారం. బిజినెస్ దగ్గర రాజీ, మొహమాటం అన్నది వుండదు ఆయనకు. అందులోనూ స్క్రిప్ట్ దగ్గర అస్సలు ఒక్క శాతం కూడా ఆయన తేడా వస్తే ఊరుకోరు. లేటెస్ట్ గా తేజ-వెంకీ సినిమా విషయంలో కూడా అలాగే వున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా స్క్రిప్ట్ ఏడాది కాలంగా చెక్కుతున్నారు. షూటింగ్ డేట్ ఫిబ్రవరి, మార్చి అంటూ వార్తలు వచ్చాయి. హీరోయిన్ దొరక్క కొన్నాళ్లు డిలే అనుకున్నారు. ఇప్పుడు అన్నీ అయిపోయాయి.

కానీ షూటింగ్ ఇప్పట్లో కాదు, ఏప్రియల్ నుంచి అని వినిపిస్తోంది. కారణం ఏంటటా? అని ఆరా తీస్తే, సురేష్ బాబుకు ఇంకా స్క్రిప్ట్ పూర్తి సంతృప్తి కలిగించలేదని సమాధానాలు వినిపిస్తున్నాయి.

జస్ట్ 60రోజుల్లో అలా తీసేసి, ఇలా ఎన్టీఆర్ బయోపిక్ మీదకు వస్తారని వినిపించింది కానీ, ఏప్రియల్ అంటే జూన్ తరువాతకు కానీ బయోపిక్ మీదకు తేజ రాలేరేమో? కొబ్బరికాయ అయితే ఈ నెలలో కొడతారు ఆ సినిమాకు. కానీ ఫుల్ స్వింగ్ లో నడిచేది మాత్రం వెంకీ సినిమా తరువాతే.