సుమంత్ సరసన ఈషారెబ్బా

మళ్లీ రావా సినిమాతో మళ్లీ కాస్త ట్రాక్ మీదకు వచ్చాడు అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుమంత్. అన్నీ వున్నా సరైన లక్ లేకపోవడం అన్నది సుమంత్ పాలిట శాపంగా కనిపిస్తుంది. మళ్లీ రావా సినిమాతో…

మళ్లీ రావా సినిమాతో మళ్లీ కాస్త ట్రాక్ మీదకు వచ్చాడు అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుమంత్. అన్నీ వున్నా సరైన లక్ లేకపోవడం అన్నది సుమంత్ పాలిట శాపంగా కనిపిస్తుంది. మళ్లీ రావా సినిమాతో మంచి సబ్జెక్ట్ దొరికితే సుమంత్ సినిమాలు కూడా ఆడతాయని అనిపించింది ఇండస్ట్రీ జనాలకు. అందుకే ఇప్పడు మళ్లీ సుమంత్ దగ్గరకు మంచి కథలు వస్తున్నాయి.

అలా వచ్చిన ఓ కథతో ఉగాది నాడు ఓ సినిమా స్టార్ట్ అవుతోంది. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గారం, సుధాకర రెడ్డి కలిసి ఓ సినిమాను ప్లాన్ చేసారు. జాగర్లపూడి సంతోష్ దర్శకుడు. ఇతగాడు ఎవరో కాదు, పురాణబ్రహ్మ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి మనవడు.

ఈ సినిమాకు ఈషారెబ్బాను హీరోయిన్ గా తీసుకుంటున్నారు. అమీతుమీ తరువాత నుంచి ఈషాకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఆ సినిమాతో అవి మరింత పెరిగాయి.

సుమంత్ తో చేయబోయే సినిమా ఉగాది నాడు ప్రారంభమవుతుంది. ఓ పురాతన గ్రామానికి సంబంధించిన సోషియో థ్రిల్లర్ గా వుంటుంది.