నాని-మాస్ సరదా పోవడం లేదు

ప్రతి హీరోకి మాస్ యాక్షన్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలన్న కోరిక బలంగా వుంటుంది. అందువల్ల కలెక్షన్లు పెరుగుతాయి. సినిమా రేంజ్ పెరుగుతుంది. ఇంకా చాలా చాలా ప్రయోజనాలు వుంటాయన్నది ఆలోచన. కానీ ఈ తరం…

ప్రతి హీరోకి మాస్ యాక్షన్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలన్న కోరిక బలంగా వుంటుంది. అందువల్ల కలెక్షన్లు పెరుగుతాయి. సినిమా రేంజ్ పెరుగుతుంది. ఇంకా చాలా చాలా ప్రయోజనాలు వుంటాయన్నది ఆలోచన. కానీ ఈ తరం ప్రేక్షకులు వేరుగా ఆలోచిస్తున్నారు.

మాస్ యాక్షన్ జోలికి వెళ్లిన ప్రతి యంగ్ హీరోను కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు. నాగ చైతన్యకు హిట్ లు ఇస్తూనే, మాస్ ట్రయ్ చేస్తే దెబ్బేస్తున్నారు. నితిన్, శర్వానంద్, విజయ్ దేవర కొండ ఇలా ప్రతి ఒక్కరినీ అదే చేసారు. మాస్ యాక్షన్ వదలనందునే మంచు మనోజ్ కు సరైన సినిమా పడడం లేదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో వుంది. 

నాని కూడా గతంలో పైసా, జెండాపై కపిరాజు, లాంటి సినిమాలు చేసినపుడు జనం ఆమోదించలేదు. ఎప్పుడైతే మాస్ ఎంటర్ టైనర్లు చేయడం ప్రారంభించాడో అప్పుడు అక్కున చేర్చుకున్నారు.

కానీ ఇప్పుడు చూస్తుంటే మళ్లీ మరోసారి మాస్ యాక్షన్ జోలికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కృష్ణార్జున యుద్ధం టీజర్ లో ఆ విషయం కొద్దిగా తొంగి చూస్తోంది. కాసనోవా టైపు క్యారెక్టర్ వరకు ఒకె. అలా కాకుండా లుంగీ ఎత్తికట్టి, గోదాలోకి దిగి ఫైట్లు గట్రా అంటే మాత్రం చూడాలి. అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో?

ఒకేరూపులో వున్న ఇద్దరు హీరోలు, హీరోయిన్లను బ్రోతల్ హవుస్ జనాలు కిడ్నాప్ చేయడం వంటి సబ్జెక్ట్ ఏదో ఈ సినిమాకు తీసుకున్నారని గుసగుసలు వున్నాయి. నాని పక్కా యూత్ అండ్ ఫ్యామిలీ హీరో.

అందువల్ల ఇలాంటి బ్రోతల్ హవుస్, కిడ్నాప్ లు లాంటివి ఏ మేరకు వర్కవుట్ అవుతాయో అన్నది చూడాలి. పైపైన టచ్ చేస్తే పరవాలేదు. అలా కాకుండా గులాబి సినిమా లెవెల్ లో డెప్త్ కు వెళ్తే సమస్య అయ్యే ప్రమాదం వుంది.