వెంకీ పెద్దోడు-మహేష్ చిన్నోడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సంగతి ఇది. వెంకీ అంటే సీనియర్ హీరో. సో ఎలాగూ అన్నగానే వుండాలి. కానీ జస్ట్ రెండేళ్ల గ్యాప్ వున్న హీరోలు అన్నదమ్ములుగా నటించాల్సి వస్తే.. ఎవరు అన్న? ఎవరు తమ్ముడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ సంగతే ఇది.
ఈ ఇద్దరు దిగ్దర్శకుడు రాజమౌళి సినిమాలో అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ సినిమా మీద బోలెడు గ్యాసిప్ లు వున్నాయి. నిజాలూ వున్నాయి. స్పోర్ట్స్ నేపథ్యం అన్నది అలాంటి గ్యాసిప్. కాదు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్, ఫక్తు కమర్షియల్ సినిమా, బాహుబలి లాంటి మరో భారీ సినిమా అన్నది నిజం.
ఇంతకీ ఈ సినిమాలో ఎవరు అన్న? ఎవరు తమ్ముడు? డౌటే ముంది? ఎన్టీఆర్ నే అన్న. చరణ్ నే తమ్ముడు. ఫిజిక్ రీత్యా కాస్త పెద్దరికం సంతరించుకున్నట్లు కనిపిస్తాడు ఎన్టీఆర్. పైగా మరో నెల పోతే ఇద్దరు పిల్లల తండ్రి. చరణ్ ఇంకా కుర్రాడిగానే కనిపిస్తున్నాడు. అందుకే రాజమౌళి సినిమాలో అన్నగా ఎన్టీఆర్, చరణ్ తమ్ముడిగా కనిపిస్తారట.
అన్నట్లు ఈ ఇధ్దరు అన్నదమ్ములు వన్ డే ఫోటో షూట్ కోసం అమెరికా వెళ్లి తిరిగివచ్చేసారు. అందరూ అనుకున్నట్లు వారం కాదు. వన్ డే మాత్రమే.