సినిమా రంగంలో సెంటిమెంట్లు భలేగా వుంటాయి. కొన్ని సెంటిమెంట్లు వర్కవుట్ అవుతాయి. మరి కొన్ని సెంటిమెంట్లు భయపెడతాయి. ఇప్పుడు లేటెస్ట్ గా అలాంటి ఓ సెంటిమెంట్ పాయింట్ ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్ గా మారింది.
చాలా మంది యంగ్ హీరోలు పాటలోనో. సినిమాలోనో దేవుడి కిరీటం తగిలించిన వారున్నారు. కానీ బ్యాడ్ లక్ ఏమిటంటే, ఇలా సివిల్ డ్రెస్ లో వుండి దేవుడి కిరీటం పెట్టిన సినిమాలు దాదాపు అన్నీ బాక్సాఫీస్ దగ్గర చతికిల పడ్డాయి అన్న లాజిక్ ను తీస్తున్నారు.
నమో వెంకటేశాయలో వెంకీ తలపై కిరీటం తగిలించాడు. నారా రోహిత్ ఓసారి కృష్ణుడి కిరీటం తలకు తగిలించాడు. బాలకృష్ణుడు సినిమా కోసం. శర్వానంద్ రాధ సినిమాలో అదే పని చేసాడు.
విజయ్ దేవరకొండ ద్వారక సినిమాలో డిటో.. డిటో.. ఆ మధ్య అల్లరి నరేష్ ఓ సినిమాలో తలకు కిరీటం తగిలించాడు. రాజ్ తరుణ్ కూడా ఓ సినిమాలో కిరిటం పెట్టుకున్నట్లు గుర్తు. ఆ సినిమాలు ఏవీ మంచి ఫలితాలు ఇవ్వలేదు.
ఇప్పుడు లేటెస్ట్ గా నాని తన కృష్ణార్జున యుద్ధంలో తలపై కిరీటం పెట్టుకోవడంతో ఇండస్ట్రీలో మరోసారి ఈ కిరీటాల సెంటిమెంట్ వ్యవహారం డిస్కషన్లలోకి వచ్చింది.