ఆంధ్రలోకి ఆసియన్ సునీల్

టాలీవుడ్ ఇండస్ట్రీని నైజాంలో శాసించగల రేంజ్ లో వున్నారు ఆసియన్ సునీల్. అది వాస్తవం. నైజాంలో అత్యథిక శాతం థియేటర్లు ఆయన చేతిలోనే వున్నాయి. దిల్ రాజకు నైజాంలో థియేటర్లు చాలా అంటే చాలా…

టాలీవుడ్ ఇండస్ట్రీని నైజాంలో శాసించగల రేంజ్ లో వున్నారు ఆసియన్ సునీల్. అది వాస్తవం. నైజాంలో అత్యథిక శాతం థియేటర్లు ఆయన చేతిలోనే వున్నాయి. దిల్ రాజకు నైజాంలో థియేటర్లు చాలా అంటే చాలా చాలా తక్కువ. పైగా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు చాలా గట్టి దెబ్బలు తిన్నారు.

నైజాంలో ఇప్పుడు ఏ సినిమా అయినా అమ్మడం అన్నది చాలా కష్టంగా మారింది. ఎందుకంటే దిల్ రాజు పెద్ద సినిమాలు కొనడం లేదు. ఆసియన్ సునీల్ కేవలం రిలీజ్ కే ఎక్కువ మొగ్గు చూపుతారు. మరో పెద్ద ప్లేయర్ అంటూ ఎవరూ లేరు. ఇలా ఎవ్వరూ లేకనే రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ కోసం యువి వాళ్లు నైజాంలో అడుగు పెట్టాల్సి వచ్చింది. అయితే ఎవరు అడుగుపెట్టినా, మళ్లీ థియేటర్ల కోసం సునీల్ దగ్గరకు రావాల్సిందే.

ఆ రేంజ్ కు చేరుకున్న సునీల్ ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆంధ్రకు కూడా విస్తరించే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా ఆయనకు సురేష్ దగ్గుబాటితో వ్యాపార బంధాలు వున్నాయి. ఆంధ్రలో సురేష్ కు బలంగా పునాదులు వున్నాయి. కానీ ఆంధ్రలో పోటీ కూడా బలంగానే వుంది. గీతా, యువి, లోకల్ ప్లేయర్స్ నుంచి సురేష్ కు పోటీ వుంది.

అయితే ఇప్పడు సురేష్ కు తోడుగా వుండడానికో, తను కూడా బలమైన ప్లేయర్ గా మారడానికో ఆసియన్ సునీల్ కూడా ఆంధ్రలో అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆంధ్ర, సీడెడ్ కలిసి 200థియేటర్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంతే కాకుండా ఆసియన్ సునీల్ ఇకపై నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారట. దిల్ రాజు మాదిరిగా యంగ్ హీరోలతో సినిమాలు నిర్మించే ఆలోచనలో వున్నారట.

ఇప్పటికే ఒకరిద్దరు యంగ్ హీరోలు ఆసియన్ సునీల్ నుంచి అడ్వాన్స్ లు అందుకున్నారు. ఇటీవల బంద్ వ్యవహారంలో గీతా అరవింద్ దాదాపు ఒంటరి అయ్యారు. ఇప్పుడు సునీల్ ఆంధ్రలోకి వస్తే, థియేటర్ల పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది.