ఆ టైటిల్ ఎవరికోసం?

ఆసక్తికరమైన టైటిల్ ఒకదాన్ని నిర్మాత ఠాగూర్ మధు రిజిస్టర్ చేయించారు. 'ముద్ర' అనే టైటిల్ కాస్త ఆసక్తికరంగా, క్యాచీగా కూడా వుంది. మరి ఏ సినిమా కోసం అన్నది పాయింట్. Advertisement ప్రస్తుతం ఆయన…

ఆసక్తికరమైన టైటిల్ ఒకదాన్ని నిర్మాత ఠాగూర్ మధు రిజిస్టర్ చేయించారు. 'ముద్ర' అనే టైటిల్ కాస్త ఆసక్తికరంగా, క్యాచీగా కూడా వుంది. మరి ఏ సినిమా కోసం అన్నది పాయింట్.

ప్రస్తుతం ఆయన నిఖిల్ హీరోగా తమిళ సినిమా గణితన్ ను సంతోష్ డైరక్షన్ లో రీమేక్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే కథానాయిక. ఈ సినిమా ముహుర్తం అయిపోయింది. రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం అవుతుంది.

మరి ఈ సినిమా కోసమే ఆ టైటిల్ రిజిస్టర్ చేయించారా? అన్నది అనుమానం. పైగా ఆ సినిమా థ్రిల్లర్, కొంత మీడియా, ఇన్వెస్టిగేషన్ తో సాగుతుంది. అందువల్ల 'ముద్ర' అనే టైటిల్ కూడా పూర్తిగా ఏప్ట్ గా వుంటుంది.

మరి ఆ మేరకు, ఆ సినిమా కోసమే రిజిస్టర్ చేయించారా? లేదా మరో రెండు చిన్న, మీడియం ప్రాజెక్టులు ఠాగూర్ మధు ప్లానింగ్ లో వున్నాయి. వాటి కోసం చేయించారా? అన్నది అనుమానం.