అప్పుడెప్పుడో చెన్నకేశవరెడ్డి సినిమా వచ్చింది. అదొచ్చి దాదాపు 14 ఏళ్లు అవుతోంది. ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత బాలయ్య, వినాయక్ మళ్లీ కలుస్తున్నారట. కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ గాసిప్ ఇది.
ఊహించని దర్శకుడ్ని తెరపైకి తీసుకురావడం బాలయ్యకు కొత్తేంకాదు. గతంలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. కాకపోతే ఈసారి వినాయక్ తో సినిమా అంటేనే నందమూరి ఫ్యాన్స్ కలవరపాటుకు గురవుతున్నారు. ఈ టైమ్ లో వినాయక్ తో సినిమా అవసరమా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఇంటిలిజెంట్ సినిమాతో వినాయక్ స్టామినా ఏంటో అందరికీ తెలిసొచ్చింది. 27 కోట్ల రూపాయలకు ఈ సినిమా అమ్ముడుపోతే, తెలుగు రాష్ట్రాల్లో పట్టుమని 4 కోట్లు కూడా రాలేదు. అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. ఇలాంటి దర్శకుడితో సినిమా అవసరమా అంటున్నారు నందమూరి అభిమానులు.
పోనీ చెన్నకేశవరెడ్డి ఏమైనా పెద్ద హిట్ అయిందా.. ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుందని సర్దుకుందామంటే, అది కూడా హిట్టేం కాదు. మరి ఇంతోటి దానికి వినాయక్ కే ఎందుకు అవకాశం ఇవ్వాలనేది ఫ్యాన్స్ వాదన. కానీ అక్కడున్నది బాలయ్య. ఈ నటసింహం ఎవరి మాట వినడు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.