సుకుమార్..? ఎందుకిలా..?

డైరక్టర్ అనే వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ముందుగా నిర్మాతను టెన్షన్ పెట్టకుండా వుండాలి. సుకుమార్ మంచి దర్శకుడే. మేధావే. అంతవరకు ఓకె. కానీ నిర్మాతలను మాత్రం టెన్షన్ ఫ్రీగా వుంచలేకపోతున్నారు.…

డైరక్టర్ అనే వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ముందుగా నిర్మాతను టెన్షన్ పెట్టకుండా వుండాలి. సుకుమార్ మంచి దర్శకుడే. మేధావే. అంతవరకు ఓకె. కానీ నిర్మాతలను మాత్రం టెన్షన్ ఫ్రీగా వుంచలేకపోతున్నారు. ఇది పైకి బహిరంగంగా నిర్మాతలు అంగీకరించకపోవచ్చు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సంగతి అయితే మాత్రం ఇదే.

ఎప్పుడు మొదలుపెట్టారు రంగస్థలం సినిమాను. ఎన్ని డేట్లు వినిపించాయి. కానీ ఇప్పటికీ ఇంకా ప్రొడెక్ట్ ను రెడీ చేయలేకపోతున్నారు. సినిమా విడుదల డేట్ ఇక మూడువారాల్లోకి వచ్చింది. చివరి వారం అంతా డిజిటల్ అప్ లోడింగ్, ఇతరత్రా వ్యవహారాలు వుంటాయి. అంటే మిగిలింది రెండు వారాల సమయం.

కానీ ఇప్పటి వరకు సెన్సారుకు ఆన్ లైన్ లో అప్లయ్ చేయలేదు. సరే, ఇంకా టైమ్ వుందిగా అనుకుంటే, ఇంకా ఎడిటింగ్ ఫైనల్ చేసి, కాపీ లాక్ చేయలేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. సినిమా ఇప్పటికి లెటెస్ట్ కట్, రెండు గంటల నలభై నిమషాల వరకు వచ్చిందని తెలుస్తోంది. కానీ అంత నిడివిని వుంచలేరు. మరి ఏ మేరకు తగ్గించేదీ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అంటే ఏడిటింగ్ ఫైనల్ కట్ లాక్ కానట్లేగా?

అజ్ఞాతవాసి అడ్డం రాకుంటే సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా. అది అడ్డం వచ్చిందని డేట్ అనౌన్స్ చేసి కూడా వెనక్కు వచ్చారు. కానీ ఇప్పటికి అంటే, ఆ డేట్ దాటిన రెండు నెలలకు కూడా కాపీ రెడీ కాకపోవడం అంటే నిర్మాతను టెన్షన్ పెట్టడం తప్ప వేరేమిటి?