‘మహానటి’ ఇంకా మేకప్ లోనే

వాయిదా సమస్యే లేదు, టీజర్ లో ఇచ్చిన డేట్ కు వచ్చి తీరాల్సిందే. ఇలా ఒక పక్క వార్తలు వదిలారు మహానటి జనాలు. మరో పక్క ఎన్టీఆర్ గా నాని, ఎన్టీఆర్ సూర్య, ఎన్టీఆర్…

వాయిదా సమస్యే లేదు, టీజర్ లో ఇచ్చిన డేట్ కు వచ్చి తీరాల్సిందే. ఇలా ఒక పక్క వార్తలు వదిలారు మహానటి జనాలు. మరో పక్క ఎన్టీఆర్ గా నాని, ఎన్టీఆర్ సూర్య, ఎన్టీఆర్ గా డిజిటల్ గ్రాఫిక్స్ అంటూ రోజుకో వార్తలు పుట్టుకువచ్చాయి. కానీ విషయం ఏమిటంటే ఈ నెల ముఫైకి మాత్రం మహానటి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

సినిమా విడుదలకు ఇంకా 20రోజలు టైమ్ వుంది. కానీ షూటింగ్ పార్ట్ ఇంకా వుండనే వుంది. సిజి పనులు వుండనే వున్నాయి. ఈ శుక్రవారం సిజి జనాలతో మీటింగ్ వుంది. అప్పుడు కానీ విడుదలపై ఓ క్లారిటీ రాదు. ఎన్టీఆర్-ఎఎన్నార్ ఎపిసోడ్ మీద కూడా సందిగ్థం అలాగే వుంది.

అన్నింటికీ మించి సావిత్రి పీరియాడిక్ బయోపిక్ నే, రంగస్థలం కూడా పీరియాడిక్ ఫిల్మ్ నే. రెండూ ఒకేసారి అంటే ఎలా వుంటుందీ అన్నది ఓ అనుమానం. అటుపక్క సుకుమార్-రామ్ చరణ్ లాంటి పేర్లు వున్నాయి. అందువల్ల టోటల్ గా చూసుకుంటే ఈ నెల 29న మహానటి అయితే విడుదలయ్యే దాఖలాలు కనిపించడం లేదు.

కానీ సరైన మరో డేట్ కూడా కనిపించడం లేదు. ఇప్పటికే జూన్ వరకు వారానికి ఓ సినిమా వరకు రుమాలు వేసేసాయి. ఈ మధ్యలో కాస్త వీక్ అనుకున్న సినిమా మీద రావడం లేదా జూన్ చివరకు వెళ్లిపోవడం.

ఏ విషయమూ రెండుమూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది.