‘బ్యాన్’లో కేంధ్రం నిధుల వైనం?

ఇప్పుడు ఆంధ్రలో హాట్ టాపిక్ ఏమిటంటే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వాటి లెక్కలు, వాటి వైనం. ఇప్పుడు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు తగ్గిపోయాయి కానీ, లేదూ అంటే కాంటెంపరరీ ఇస్యూలు అన్నీ…

ఇప్పుడు ఆంధ్రలో హాట్ టాపిక్ ఏమిటంటే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వాటి లెక్కలు, వాటి వైనం. ఇప్పుడు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు తగ్గిపోయాయి కానీ, లేదూ అంటే కాంటెంపరరీ ఇస్యూలు అన్నీ సినిమాల్లో కనిపించేవి. గతంలో ఈ తరహా వ్యవహారాలు ఎక్కువగా వుండేవి. 

అయితే రాబోయే భరత్ అనే నేను సినిమాలో వర్తమాన అంశాలు కాస్త డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ భరత్ అనే నేను అన్నదే చెబుతోంది. కాస్త రాజకీయ నేపథ్యం వుందని… అది నిజమే. కానీ పూర్తిగా కాదు. అనుకోకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి, కానీ అంతలోనే ఆ పదవి నుంచి దిగిపోయి, తరువాత వేరే పంథాలో నడిచే యువకుడి కథగా 'బ్యాన్' (భరత్ అనే నేను) కనిపిస్తుందట. 

కేవలం అరగంట సేపు మాత్రమే సినిమాలో పొలిటకల్ వ్యవహారాలు వుంటాయట. మిగిలిన సినిమా అంతా మాంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రన్ అవుతుందట. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ అరగంట సేపు రాజకీయాల్లో కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఆ నిధుల ఖర్చు, ఈ టోటల్ ఎపిసోడ్ లో వుండే లోపాలు, లొసుగులు కూడా లైట్ గా టచ్ చేసారని తెలుస్తోంది.

దర్శకుడు కొరటాల శివకు కాస్త వామపక్ష నేపథ్యం వుంది. ఆయనకు రాజకీయ వ్యవస్థలు, అవ్యవస్థలపై అవగాహన వుంది. అందువల్ల ఆయన ప్రస్తావించినా, కామెంట్ చేసినా అది కచ్చితంగా సహేతుకంగా వుంటుందనే అనుకోవాలి.