శర్వానంద్ కోసం అందరూ…

హీరో శర్వానంద్ కు టాలీవుడ్ లో  మంచి స్నేహితులు వున్నారు. యువి సంస్థ అధినేతలు, హీరో రామ్ చరణ్ ఇలా చాలా మంది. వీరు కాక తెలంగాణ యువనేత కేటిఆర్ కూడా మంచి సన్నిహితుడు.…

హీరో శర్వానంద్ కు టాలీవుడ్ లో  మంచి స్నేహితులు వున్నారు. యువి సంస్థ అధినేతలు, హీరో రామ్ చరణ్ ఇలా చాలా మంది. వీరు కాక తెలంగాణ యువనేత కేటిఆర్ కూడా మంచి సన్నిహితుడు. వీరంతా ఇప్పుడు శర్వా సినిమా శ్రీకారం కోసం తరలి వస్తున్నారు.

రామ్ చరణ్ ప్రత్యేకంగా పూనుకుని మెగాస్టార్ ను ఒప్పించారు. దాంతో ఆయన ఖమ్మంలో జరిగే శ్రీకారం ఈవెంట్ కు హాజరయ్యేందుకు ఒకె అన్నారు. 

హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ కు రావడం వేరు. ఖమ్మం వరకు ప్రత్యేకంగా వెళ్లడం వేరు. అది కేవలం రామ్ చరణ్ తో శర్వాకు వున్న స్నేహం వల్లనే సాధ్యం అయింది. అలాగే కేటిఆర్ ప్రత్యేకంగా హైదరాబాద్  లో జరిగే మరో ఈవెంట్ కు హాజరవుతున్నారు. 

శ్రీకారం సినిమా మాంచి టఫ్ కాంపిటీషన్ లో విడుదలవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి సెలబ్రిటీలతో ఫంక్షన్ లు జరపడం అన్నది సినిమా ఓపెనింగ్స్ కు అయితే గట్టిగా సహకరిస్తుంది. 

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే