పవన్‌కళ్యాణ్ అభిమానులతో 'చెప్పను బ్రదర్' అంటూ గొడవకి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్‌కి ఇప్పుడు పవర్‌స్టార్ అభిమానుల నుంచి పూర్తి స్థాయి నాన్ కోపరేషన్ వుంది.
చరణ్ ప్లానింగ్‌కి అడ్డు తగులుతున్నాడంటూ, మీడియా మేనేజ్మెంట్తో మెగా ఫ్యామిలీకి తదుపరి మెగాస్టార్ తానే అన్నట్టు చూపించుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానుల నుంచి వ్యతిరేకత వుంది.
ఇక పబ్లిక్ వేడుకల్లో డిక్టేటర్ మాదిరి ప్రవర్తనతో, తరచుగా అభిమానులపై ఆవేశపడుతూ మరింత మంది హేటర్స్‌ని సంపాదించుకున్నాడు. అలాగే తన సినిమాలకి రివ్యూలు సరిగా ఇవ్వలేదని క్రిటిక్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక వర్గం మీడియాతో వైరం పెట్టుకున్నాడు.
తాజాగా 'నా పేరు సూర్య' వర్సెస్ 'భరత్ అనే నేను' విడుదల తేదీ వివాదంతో మహేష్ ఫాన్స్‌కి కూడా శత్రువయ్యాడు. నా పేరు సూర్య చిత్రానికి ముందుగా ఏప్రిల్ 27 డేట్ అని ప్రకటించిన మాట వాస్తవమే. అదే డేట్‌కి మహేష్ సినిమా అనౌన్స్ అయిన దగ్గర్నుంచి బన్నీ క్యాంప్ చేసిన పబ్లిక్ రభస అంతా ఇంతా కాదు.
మాట్లాడుకుంటే పోయేదానికి ఈగో క్లాష్ల వరకు తీసుకెళ్లారు. వాళ్లు ఎప్పుడు డేట్ అనౌన్స్ చేస్తే అప్పుడు తాము కూడా ప్రెస్‌నోట్ పంపిస్తూ నానా యాగీ చేసారు.
మొత్తానికి ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినా కానీ ఈ వ్యవహారంలో మహేష్ వైపు నుంచి ఏదీ బయటకి రాలేదు కానీ బన్నీ వర్గం మాత్రం పబ్లిక్‌గా ఛాలెంజ్‌లు విసురుతూ తమ స్థాయికి తగ్గట్టు అస్సలు బిహేవ్ చేయలేదు.