ఆడవాళ్ల అలంకరణ అంటే తెలిసిందే. చాలా టైమ్ తీసుకుంటారు. మరి మామూలు లేడీస్ నే అలా అయితే ఇక హీరోయిన్లు? ఇంకా చాలా టైమ్ తీసుకుంటారు. హీరోయిన్ కీర్తి సురేష్ ఆ విధంగా మిగిలిన హీరోయిన్ల కన్నా ముందు వుంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాత్రలను బట్టి, మేకప్ ను బట్టి కొన్నిసార్లు గంటలకు గంటలు మేకప్ కు టైమ్ పట్టడం మామూలే. కానీ కీర్తిసురేష్ వ్యవహారం అలాకాదట.
ఆమె చాలా ప్రాంప్ట్ గా సెట్ కు వస్తుందట. కానీ వన్స్ సెట్ కు వచ్చిన తరువాత మేకప్ స్టార్ట్ చేస్తే మాత్రం కనీసం రెండు మూడు గంటలు కూడా పట్టిన సందర్భాలు వున్నాయట.
మేకప్ విషయంలో కాస్త ఓవర్ శ్రద్ధ చూపించడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. అయితే సినిమా అంటే గ్లామర్ కాబట్టి, సినిమా కోసమే మేకప్ కాబట్టి, నిర్మాతలు, డైరక్టర్లు ఏమీ అనలేక ఓపిగ్గా కాసుకుని వుంటారట,
కీర్తి ఎప్పుడు మేకప్ ఫినిష్ చేసుకుని, కేరవాన్ నుంచి బయటకు వస్తుందా అని. ఉదయాన్నే వచ్చినా ఎప్పుడూ కీర్తి షూట్ స్టార్ట్ అయ్యేసరికి పదకొండు అయిపోతుందని టాక్ వినిపిస్తోంది.