ఇండస్ట్రీలో మంచి పేరు ముఖ్యం. ఎంత పెద్ద హీరో అయినా ఇక్కడ వీలయినంత ఓర్పు, నేర్పు చూపించాలి. మంచితనం కనీసం ప్రదర్శించగలగాలి. లేదూ అంటే ఇండస్ట్రీ చాలా స్మూత్ గా పక్కన పెడుతుంది. ఇదంతా ఎందుకంటే లేటెస్ట్ గా అల్లుశిరీష్ వ్యవహారం ఒకటి గుప్పుమంటోంది ఇండస్ట్రీలో.
శిరీష్ మళయాలంలో ఓ సినిమా చేసాడు మోహన్ లాల్ తో కలిసి. అది యుద్ధభూమి పేరిట తెలుగులోకి వస్తోంది. ఈ సినిమా ముందుగా సీనియర్ ప్రొడ్యూసర్ ఎన్వీప్రసాద్ తెలుగులో అందించాల్సి వుంది. మళయాలంలో ఫ్లాప్ కావడంతో తెలుగులో అందించే విషయం పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఆఖరికి ఎవరో అడిగితే ఆ సినిమాను థ్రో అవే ప్రయిస్ కు ఇచ్చేసారు. ఇక్కడ చిన్న మతలబు వుందట. తెలుగులోకి చేసేటపుడు శిరీష్ కు పదిహేను లక్షలు ఇవ్వాలన్నది ఏదో వుందట.
తనకు తెలియకుండా సినిమా విడుదల చేస్తున్నారని శిరీష్ భావించి, నేరుగా ఎన్వీప్రసాద్ లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ కు ఫోన్ చేసి, కాస్త గట్టిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన ఫీలయినట్లు వినికిడి. ఎన్వీ ప్రసాద్ అంటే చిరంజీవి నుంచి అందరు హీరోలు గౌరవం ఇచ్చే నిర్మాత. అలాంటి నిర్మాతను శిరీష్ అలా ఫోన్ లో నిలదీయడం ఎంతవరకు అన్న కామెంట్ లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఆ తరువాత యుద్ధభూమి తీసుకున్నవారు శిరీష్ కు, డబ్బులు ఇవ్వడం, డబ్బింగ్ చెప్పడం అన్నీ జరిగిపోయాయి. కానీ ఎన్వీ ప్రసాద్ పై శిరీష్ మాట మాత్రమే వుండిపోయింది.