వివరాలు వస్తాయా పవనూ?

జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా అంటే  చాలా మాట్లాడేసారు. ఒక పక్క అన్యాయంగా విభజించారు అంటారు. మళ్లీ అంతలోనే పోరాట ఫలితం అంటారు. నాయకులు చేసిన…

జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా అంటే  చాలా మాట్లాడేసారు. ఒక పక్క అన్యాయంగా విభజించారు అంటారు. మళ్లీ అంతలోనే పోరాట ఫలితం అంటారు. నాయకులు చేసిన దానికి ప్రజలు అనుభవిస్తున్నారు అంటారు. ఆ నాయకుల్లో తన అన్న కూడా వున్నారన్న సంగతే మరచిపోతారు.

ఇంతకీ ఈ అయోమయపు పోలిటికల్ స్పీచ్ సంగతి అలా వుంచితే, ప్రసంగవశాన ఓ మాట అన్నారు. సేకరించిన వివరాలు వివిధ సబ్ కమిటీలకు అందించి, మధింపచేసి, ఆ పైన నివేదక తయారుచేయిస్తారట. అప్పుడు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారట.

అంటే మరి ఇక్కడ రెండుపాయింట్లు వున్నాయి. అసలు మధించడానికి వివరాలు అందినట్లేనా? అందితే ఎలా అందాయి? వెబ్ సైట్ లు ఇంతరత్రా సమాచార సాధానల ద్వారా సేకరించిన వివరాలేనా? లేక ప్రభుత్వం ఏమైనా వివరాలు అందించిందా?

రెండో పాయింట్ కేవలం జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మాత్రమే కాదు, ఇంకా అనేక ఉపకమిటీలు కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, మాజీ సిఎస్ ఐవిఆర్ కృష్ణారావు మరో ఇద్దరితో ఏర్పాటు చేసిన కమిటీ వివరాలు సేకరించుకుని, విశ్లేషించాలట.

పవన్ అడిగితేనే ఇవ్వలేదు. ఆ విషయం తెలియనట్లే, వ్యవహరిస్తూ, వివరాల సేకరణ బాధ్యత ఉపసంఘపైకి నెట్టేసాడు పవన్ కళ్యాణ్. కానీ సమస్య ఏమిటంటే, పవన్ అడిగితేనే బాబుగారు ఇవ్వలేదు. ఐవిఆర్ కృష్ణారావు అడిగితే ఇస్తాడా? ఇలాచేసే కన్నా, కేంద్రం విడుదలలపై ఆర్టీఐ యాక్ట్ కింద దరఖాస్తు చేసినట్లు, రాష్ట్రం దగ్గర కూడా చేయవచ్చుకదా? కానీ పవన్ అలా చేస్తారా? అనుమానమే.