మేనేజర్ కే మేనేజర్ అయ్యాడు

అనగనగా ఓ హీరో. ఎంత గజనీ దండయాత్రలు చేస్తున్నా కెరీర్ టర్నింగ్ ఇచ్చుకోవడం లేదు. అప్పుడెప్పుడో వచ్చిన ఓ హిట్ తప్పు, మళ్లీ మరోటి కళ్ల చూస్తే ఒట్టు. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ…

అనగనగా ఓ హీరో. ఎంత గజనీ దండయాత్రలు చేస్తున్నా కెరీర్ టర్నింగ్ ఇచ్చుకోవడం లేదు. అప్పుడెప్పుడో వచ్చిన ఓ హిట్ తప్పు, మళ్లీ మరోటి కళ్ల చూస్తే ఒట్టు. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ ట్రయల్స్ చేస్తూనే వున్నాడు. అలాంటి హీరో ఓ మేనేజర్ ను పెట్టుకున్నాడు.

సాధారణంగా హీరోల మేకప్ మెన్ లు, అసిస్టెంట్ లు, మేనేజర్లు, ఆ పదవులతో వచ్చిన పరిచయాలు వాడుకుని, చిన్న చిన్న పాత్రలు సినిమాల్లో వేస్తూ వుంటారు. ఈ హీరో మేనేజర్ కూడా అలాగే తమిళంలో ఒకటి రెండు పాత్రలు చేసాడంట. ఆ సినిమాలు కాస్తా హిట్ అయ్యాయి. దాంతో మనవాడికి గిరాకీ కాస్త కనిపించడం ప్రారంభమైంది.

కానీ ఇక్కడే వుంది సమస్య. సదరు మేనేజర్ ను తమ సినిమాలోకి తీసుకోవాలనుకున్నవారు, ఈ హీరోను కాంటాక్ట్ చేయడం మొదలుపెట్టారట. మీ మేనేజర్ వున్నాడా.. క్యారెక్టర్ వుంది. చేస్తాడా అనే టైపులో. దీంతో మేనేజర్ కు తాను మేనేజర్ అయినట్లు తయారయింది హీరోగారి పరిస్థితి. ఇక ఇలా అయితే లాభం లేదని, ఆ మేనేజర్ ను మార్చేసి, వేరే మేనేజర్లను పెట్టుకున్నాడట ఆ హీరో.

ఈ మేనేజర్లతో సమస్య లేదులెండి. ఎందుకంటే ఈ మేనేజర్లకు సినిమాలు కుదర్చడం తప్ప, నటించడం మీద ఇంట్రెస్ట్ లేదట.