అ..ఆ సినిమాకు మాంచి పాటలు ఇచ్చాడు మ్యూజిక్ డైరక్టర్ మిక్కీ జే మేయర్. ఆ తరువాత మళ్లీ త్రివిక్రమ్ తో కాంబినేషన్ రిపీట్ కాలేదు. మధ్యలో పవన్ సినిమాకు అనిరుధ్ వచ్చాడు. ఎన్టీఆర్ సినిమాకు అయినా మిక్కీని పెట్టుకోవచ్చు కదా? అన్న సలహాలు ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపించాయి.
అయితే ఈ ఆలోచన త్రివిక్రమ్ చేయలేకపోలేదట. మిక్కీని పెడదామని ఎన్టీఆర్ దగ్గర ప్రపోజ్ చేసాడట. కానీ దానికి ఎన్టీఆర్ నో అనేసాడట. అనిరుధ్ తో ముందు కమిట్ అయ్యారు కాబట్టి, ఆయనతో తనకు ఓకె అని.. లేదూ అంటే దేవీశ్రీప్రసాద్ అయినా సరే అని మిక్కీ మాత్రం వద్దని చెప్పాడట. కారణం మరేం లేదు. తన డ్యాన్స్ లకు తగిన మాస్ బీట్ పాటలు మిక్కీ ఇవ్వలేడని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డాడట.
అయితే దేవీశ్రీప్రసాద్ తో త్రివిక్రమ్ కు ఏవో సమస్యలు వుండడంతో ఆ పేరును ఆయన వీటో చేసి, థమన్ పేరును తెరపైకి తెచ్చారట. దానికి ఎన్టీఆర్ సరే అనడంతో, ఇప్పుడు థమన్ తో డిస్కషన్ స్టార్ట్ చేసినట్లు బోగట్టా. అగ్రిమెంట్ మాత్రం ఇంకా కాలేదు.
ఒకప్పుడు తాను ఏదంటే అదే ఫైనల్ గా వుండేది త్రివిక్రమ్ విషయంలో. అలాంటిది ఆయన ప్రతిపాదించిన మిక్కీ జే మేయర్ పేరును ఎన్టీఆర్ వీటో చేయడం అంటే, పవర్ కొంచెం తగ్గిందన్నమాట. అజ్ఞాతవాసి ఎఫెక్ట్ అనుకోవాలా?