ఈసారి ఎవరో స్పాన్సరర్?

జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి అంతా హై క్లాస్, పైవ్ స్టార్ లెవెల్ లోనే నడుస్తోంది. ఆరంభంలో నోవాటెల్, హైటెక్స్ లాంటి కాస్ట్లీ హోటళ్లలో, కన్వెన్షన్ సెంటర్లలో సమావేశాలు పెట్టారు. అప్పుడు అంటే…

జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి అంతా హై క్లాస్, పైవ్ స్టార్ లెవెల్ లోనే నడుస్తోంది. ఆరంభంలో నోవాటెల్, హైటెక్స్ లాంటి కాస్ట్లీ హోటళ్లలో, కన్వెన్షన్ సెంటర్లలో సమావేశాలు పెట్టారు. అప్పుడు అంటే పివిపి లాంటి ఫుల్ సౌండ్ పార్టీ వెనకాల వుండి స్పాన్సర్ చేసారు కాబట్టి ఒకె. మరి ఇప్పుడు?

ఎందుకంటే పార్టీ నడపడానికి తన దగ్గర డబ్బులు లేవని, సినిమాలు చేసి, ఆ డబ్బులతో పార్టీ నడుపుతానని గతంలో ఒకటికి రెండుసార్లు పవన్ చెప్పుకొచ్చారు. మరి అలాంటిది జస్ట్ 20మందితో మీటింగ్ కోసం దస్ పల్లా స్టార్ హోటల్ ను ఎంచుకున్నారు. ఈ మధ్యే జనసేన ఆఫీసును అన్ని విధాలా పూర్తిగా మార్పులు చేసి రెడీచేసారు. మరి అక్కడ ఇరవై మంది కూర్చునేందుకు చోటు లేదా?

లేదూ అనుకుంటే, పవన్ ఫార్మ్ హవుస్ వుండనే వుంది కదా? మరి ఇలా ఫ్రీ వెన్యూలు వదిలేసి, దస్ పల్లా స్టార్ హోటల్ లో పెట్టారు మీట్ అంటే ఖర్చు పవన్ జనసేనదా? లేక స్పాన్సరర్ ఎవరన్నా వున్నారా? లేక ఆ హోటల్ ఏమన్నా కర్టెసీగా సహకరించిందా? అలా సహకరించినా మళ్లీ అనుమానాలు వ్యక్తం అవుతాయి.

ఎందుకంటే దస్ పల్లా మేనేజ్ మెంట్ లో కీలకమైన యార్లగడ్డ రాఘవేంద్రరావు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు అని, చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం వున్నవారు అని పేరు వుంది మరి.

ఆర్టీఐ యాక్ట్ కింద ప్రభుత్వాలను వివరాలు అడిగే ముందు పవన్ కూడా తన పార్టీ ఖర్చులను, రాబడులను పారదర్శకంగా ట్విట్టర్ లో పోస్ట్ చేయచ్చుగా?